ఈ రాశివారికి కోపం వస్తే.. నరకం చూపిస్తారు..!
అలా జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులను గుర్తించారు. ఆ రాశులవారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

ఒక్కో మనిషి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరు.. ఇలా చూసినవెంటనే ఎవరితోనైనా కలిసిపోతారు. కానీ.. కొందరు మాత్రం.. ఎంత కలవాలని ప్రయత్నించినా కలవలేం. అలా కలవలేకపోవడానికి వారి ప్రవర్తన కూడా కారణం కావచ్చు. అలా జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులను గుర్తించారు. ఆ రాశులవారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
వృశ్చిక రాశి..
ఈ రాశివారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కనీసం వీరికి ఎవరైనా దారిలో అడ్డంగా నిలపడినా కూడా తట్టుకోలేరు. వీరు చాలా క్రూరంగా ఆలోచిస్తారు. తమకు లాభం చేకూరడం కోసం ఏదైనా చేస్తారు. తమ ప్రయోజనం కోసమే ఇతరులతో మంచిగా మెలగాలని అనుకుంటారు. ఏ విషయంలోనూ అస్సలు రాజీపడరు. ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కూడా వెనకాడరు. వీరికి కోపం వస్తే.. ఎదుటివారికి నరకం చూపిస్తారు.
కుంభరాశి..
ఈ రాశివారు చూడటానికి అందరితో స్నేహంగా.. మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వారు నిజంగా అలాకాదట. చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి.. వీరితో ఉండటం కూడా కష్టం. ఎవరు ఏ మాట అన్నా.. వెంటనే హర్ట్ అయిపోతారు. ఎప్పుడూ అందరూ తమపై సానుభూతి చూపించాలని అనుకుంటూ ఉంటారు. తమపై సానుభూతి చూపనివారితో ఉండాలని అనుకోరు. అలాంటి వారిని దూరంగా పెడతారు.
కన్య రాశి..
ఈ రాశివారు ఎదుటివారిని విమర్శలతో బాధపెడుతూ ఉంటారు. చాలా స్వార్థంగా ఆలోచిస్తారు. ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచన కూడా వీరికి రాదు. అందరిమీద ఆధిపత్యం చేయాలని చూస్తుంటారు. తమతో ఉన్న అందరినీ తక్కువగా చేసి మాట్లాడతారు.
మిథున రాశి..
ఈ రాశివారు చాలా కన్నింగ్ గా ఆలోచిస్తారు. తమకు ఏదైనా దక్కలేదంటే తమలోని నటనను బయటపెడతారు. అందరి దృష్టి ఆకర్షించలేనప్పుడు.. భయపడినట్లు నటిస్తారు. ఈ రాశివారు ఎదుటివారిని ప్రశాంతంగా ఉండనివ్వరు.
మేష రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ అందరితో గొడవలు పెట్టుకోవాలని చూస్తుంటారు. అందరూ తనకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంటారు. ఇతరులను మాత్రం ఆయన పట్టించుకోరు. తన తప్పులు మాత్రం అంగీకరించడానికి అస్సలు ముందుకు రారు. ఇతరులపై వెంటనే నిందలు వేస్తుంటారు.