- Home
- Astrology
- Zodiac Signs: ఈ 5 రాశుల అబ్బాయిలు అందమైన భార్య ఉన్నా.. పరాయి స్త్రీకి అట్రాక్ట్ అవుతారు!
Zodiac Signs: ఈ 5 రాశుల అబ్బాయిలు అందమైన భార్య ఉన్నా.. పరాయి స్త్రీకి అట్రాక్ట్ అవుతారు!
పెళ్లి బంధం.. ప్రేమ, నమ్మకం, నిజాయతీపై ఆధారపడి ఉంటుంది. ఈ బంధంలోని ఏ వ్యక్తి తప్పుచేసినా దాని ప్రభావం మరొకరిపై పడుతుంది. కాబట్టి భార్యా భర్తల బంధాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు ఇంట్లో మంచి భార్య ఉన్నా.. వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకోవడానికి ఆరాటపడతారట. ఆ రాశులెంటో? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అబ్బాయిలు.. ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి ఆరాటపడతారు. కొన్నిసార్లు వేరే స్త్రీలతో సంబంధం కూడా పెట్టుకుంటారట. ఆ రాశులెంటో? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.
మిథున రాశి
మిథున రాశి వారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి, అనుభవించడానికి ఆసక్తి చూపుతారు. భార్య లేదా ప్రియురాలు ఉన్నా, ఇతరులతో భావోద్వేగ సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాలే ఇతర సంబంధాలకు దారితీస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు సాహస జీవితానికి, స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తారు. తమ స్వేచ్ఛకు భార్య, పిల్లలు, పెద్దలు ఎవరూ అడ్డు రాకూడదని కోరుకుంటారు. స్వేచ్ఛకు భంగం కలిగితే వేరే సంబంధం పెట్టుకోవడానికి కూడా వెనుకాడరు.
సింహ రాశి
సింహ రాశి వారు మంచి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. నాయకుడిగా గుర్తింపు పొందాలని కోరుకుంటారు. తమ ప్రేమకు ప్రతిఫలం దక్కకపోతే, ప్రేమించే వారి వైపు ఆకర్షితులవుతారు. అందుకే వేరే సంబంధం పెట్టుకుంటారు.
మేష రాశి
మేష రాశి వారు ప్రతిదీ త్వరగా చేయాలనుకుంటారు. భార్య నుంచి కూడా అదే కోరుకుంటారు. తమకు కావాల్సినది దక్కకపోతే వెంటనే వేరే సంబంధం కోసం చూస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు భావోద్వేగ జీవులు. భార్యతో బలమైన సంబంధం, నమ్మకం, శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ, నమ్మకానికి ద్రోహం జరిగితే లేదా భావోద్వేగ సమస్యలు ఉంటే వేరే సంబంధం వైపు చూస్తారు.