Zodiac sign: మంగళ, శని గ్రహాల అశుభకర యోగం, ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే
జోతిష్యశాస్త్రం లో మంగళ, శని గ్రహాల షడాష్టక యోగం ఏర్పడనుంది. ఈ యోగాన్ని అశుభంగా భావిస్తారు. అందుకే ఏడు రాశులవారు ఈ కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

Shadashtak Yoga
జోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కేవలం రాశులను మార్చుకున్నప్పుడు మాత్రమే కాదు, అవి స్థానాలను మారినప్పుడు కూడా మన జీవితాలు తలకిందులు అవుతాయి. ముఖ్యంగా మన జాతకంలో 6,8 స్థానాలను అశుభంగా భావిస్తారు. గ్రహాలు ఈ స్థానాల్లో కదిలినప్పుడు మనకు అశుభం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జూన్ 7, 2025 న మంగళ గ్రహం సింహ రాశిలోకి అడుగుపెడతాడు. జులై 28 వరకు ఉంటాడు. జూన్ 7 నుంచి జులై 28వ తేదీ వరకు శని, మంగళ షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఇది ఐదురాశుల వారికి కష్టకాలం తెచ్చి పెట్టనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
telugu astrology
1.వృషభ రాశి..
ఈ షడాష్టక యోగం కారణంగా వృషభ రాశివారికి ఉద్యోగం లో ఒత్తిడి, సహోద్యోగులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. డబ్బు విషయంలోనూ ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగొచ్చు. వ్యాపారంలో నష్టాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపే సమయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావేదీల్లోనూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
telugu astrology
2.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి షడాష్టక యోగం అశుభంగా మారనుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.గ్యాస్, కడుపు నొప్పి ఇబ్బంది ఏర్పడొచ్చు.కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు రావచ్చు. పెట్టుబడి పెట్టే సమయంలో అస్సలు తొందరపాటు పడొద్దు. ఆహారం విషయంలో జాగ్రత్త లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
telugu astrology
3.కన్య రాశి..
కన్య రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు. భాగస్వామ్య వ్యాపారంలో నష్టాలు. మానసిక ఒత్తిడి, ఆందోళన. జీవిత భాగస్వామితో మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి.
telugu astrology
మకర రాశి..
మకర రాశి వారికి మానసిక అలసట, ఒత్తిడి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాల్లో ఇబ్బంది. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మనశ్శాంతిని కాపాడుకోవాలి.
telugu astrology
కుంభ రాశి..
కుంభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు. ఎముకలు, కీళ్ల నొప్పులు. ఉద్యోగ, ఆదాయ మార్గాల్లో ఆటంకాలు. సన్నిహితుల మోసం. పెట్టుబడులు పరిశీలించుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.