ఈ 5 నక్షత్రాల్లో పుట్టిన వారికి పెళ్లి త్వరగా అవుతుంది.. కానీ ఆ తర్వాత చుక్కలే!
మనలో చాలామంది పెళ్లి గురించి రకరకాల కలలు కంటారు. కానీ అందరికీ అవి నిజం కావని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారికి పెళ్లి త్వరగా అవుతుంది. కానీ ఆ తర్వాత జీవితం కష్టంగా మారిపోతుంది. ఏ నక్షత్రాల వారికి ఇలా జరుగుతుందో చూద్దాం.

పెళ్లి త్వరగా అయ్యే జన్మ నక్షత్రాలు
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక మలుపు. కొత్త అధ్యాయం. సాధారణంగా పెళ్లిని సంతోషం, పరస్పర ప్రేమతో నిండిన బంధంగా ఊహిస్తాం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారికి పెళ్లి జీవితం అంతగా కలిసిరాదు. నిజానికి వీరికి పెళ్లి త్వరగానే జరుగుతుంది. కానీ దాని తర్వాతే అసలు కథ మొదలవుతుంది. పెళ్లైన కొత్తలో ప్రేమ, ఆకర్షణ, ఆహ్లాదం ఉండవచ్చు. కానీ పోను పోను ఒత్తిడి, విభేదాలు, అహంకారం, అసహనం వారి జీవితాన్ని నరకంలా మారుస్తాయి. మరి ఏ నక్షత్రాల్లో పుట్టినవారికి పెళ్లి జీవితం కష్టంగా మారుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. వీరు ప్రేమలో తొందరగా పడతారు. మొదటి చూపులోనే వీరు ఆకర్షితులవుతారు. అందువల్ల పెళ్లి త్వరగా జరుగుతుంది. కానీ వీరి ఫాస్ట్ నెస్, సాహసోపేతమైన స్వభావం కొన్నిసార్లు జీవిత భాగస్వామికి ఇబ్బందికరంగా మారుతుంది. చిన్న చిన్న విషయాలపై గొడవలు, అసహనం పెరిగిపోతాయి. దానివల్ల పెళ్లి జీవితం కష్టాలమయంగా కనిపిస్తుంది.
రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్రంలో పుట్టినవారు అందం, చమత్కారం, సౌందర్యానికి ప్రతీకగా ఉంటారు. వీరు చాలా రొమాంటిక్. త్వరగా ప్రేమలో పడిపోతారు. మొదట ఆ ప్రేమ మధురంగా అనిపిస్తుంది.. కానీ కొంతకాలం తర్వాత భావోద్వేగాల్లో మార్పులు, ఆలోచనల్లో తేడా వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. వీరు చిన్న చిన్న విషయాలకు బాధపడటం, అసహనం వ్యక్తం చేయడం వల్ల పెళ్లి జీవితం కష్టంగా మారుతుంది.
మఖ నక్షత్రం
మఖ నక్షత్రంలో జన్మించిన వారు గౌరవం, ప్రతిష్ట, కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇస్తారు. వీరి వివాహ జీవితం కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో సాఫీగా మొదలవుతుంది. కానీ వీరి అధిక ఆత్మగౌరవం, నా మాటే నెగ్గాలనే పట్టుదల కారణంగా చిన్న విభేదాలు కూడా పెద్ద సమస్యలుగా మారుతాయి. మఖ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం ప్రేమతో కూడిన కష్టాల కలయికగా ఉంటుంది.
హస్త నక్షత్రం
హస్త నక్షత్రంలో జన్మించిన వారు చురుకుగా, తెలివిగా ఉంటారు. వీరు త్వరగా ప్రేమలో పడుతారు. పెళ్లి చేసుకుంటారు. కానీ వీరి అస్థిరమైన స్వభావం వల్ల వివాహ జీవితం సమస్యలతో నిండిపోతుంది. చిన్న సమస్యలు పెద్ద వివాదాలుగా మారి.. దంపతుల మధ్య దూరం పెరిగి పోయే అవకాశం ఉంటుంది.
పూర్వ ఫల్గుణి నక్షత్రం
పూర్వ ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు శుక్రుడి ప్రభావం వల్ల ప్రేమతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మొదట వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ వీరి ఇష్టాలు, అలవాట్లు త్వరగా మారడం వల్ల దంపతుల మధ్య విభేదాలు వస్తాయి. అవి కొన్నిసార్లు పెద్దగా మారి దంపతుల మధ్య దూరాన్ని పెంచుతాయి.