ఈ రాశివారు పెద్ద మానిప్యూలేటర్స్..మొత్తం తారుమారు చేస్తారు..!
కొందరు పరిస్థితిని బట్టి అలా చేస్తే.. కొందరు మనసులో దుర్మార్గపు ఆలోచన ఉంచుకొని అలా చేస్తుంటారు. అలాంటివారు ఎవరు అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఏ రాశులవారు.. ఇతరులను మాన్యుపూలేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం..

అక్కడ జరిగింది ఒక్కటి అయితే.. దానిని పూర్తిగా మార్చేసి.. ఇతరులకు చెప్పి.. తాము చెప్పిందే నమ్మించడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. మొత్తం సిట్యూవేషన్ ని మార్చేస్తుంటారు. ఎదుటి వారిని పూర్తిగా మానిప్యూలేట్ చేసేస్తుంటారు. అయితే.. కొందరు పరిస్థితిని బట్టి అలా చేస్తే.. కొందరు మనసులో దుర్మార్గపు ఆలోచన ఉంచుకొని అలా చేస్తుంటారు. అలాంటివారు ఎవరు అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఏ రాశులవారు.. ఇతరులను మాన్యుపూలేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం..
వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా విషయాలను రహస్యంగా దాచుకుంటారు. అంతేకాకుండా.. ఎదుటివారిపై పగ పెంచుకుంటూ ఉంటారు. ఎవరైనా ఎదైనా విషయంలో గందరగోళంగా ఉంటే.. వారిని తమ మాటలతో మానిప్యూలేట్ చేసేస్తుంటారు. బాధితులను ఆడుకుంటారు. సమయం చూసుకొని పగ తీర్చుకుంటారు.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు అత్యంత సున్నితమైన వారు. ఎమోషన్స్ విషయంలో మానిప్యూలేట్ చేస్తారు. వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎమోషన్ ని గ్రిప్ పెట్టుకొని ఎదుటివారిని మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు.
తుల రాశి..
ఈ రాశివారు అందరి ముందు మంచిగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో.. చెడు ని కూడా మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు. తాము ఏ పని చేసినా... తమను మాత్రం ఎవరూ చెడుగా అనుకోకూడదు అని వీరు అనుకుంటూ ఉంటారు. అందుకే జరిగిన విషయాన్ని మొత్తాన్ని తారుమారు చేసి ఎదుటివారికి చెబుతూ ఉంటారు.
సింహ రాశి..
సింహ రాశిని సూర్యుడు పాలిస్తూ ఉంటాడు. ఈ రాశివారికి ఇతరుల నుంచి అటెన్షన్ ఎక్కువగా కోరుకుంటారు. వారు కోరుకున్నది వారు కావాలని కోరుకుంటారు. తమను తాము రాజులా ఫీలౌతూ ఉంటారు. దాని కోసం ఈ విషయాన్ని అందరి చేత నమ్మించడానికి.. మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు.
మిథున రాశి...
ఈ రాశివారు తమ అవసరం కోసం ఏదైనా చేస్తారు. ఎదుటి వారిని మానిప్యూలేట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటారు. పూర్తిగా ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని కూడా మార్చేయగల సత్తా వీరిలో ఉండటం గమనార్హం.