ఈ రాశివారి ఆటిట్యూడ్ ను తట్టుకోవడం కష్టం...
కొంతమంది వ్యక్తుల్ని చూడగానే వీరికి చాలా పొగరు అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే వారి ప్రవర్తనా ఉంటుంది. అయితే ఈ ఆటిట్యూడ్ కి కారణం వారి రాశిలోనే ఉందట.

ప్రతీ వ్యక్తికి తనదైన ఆటిట్యూడ్ ఉంటుంది. అందరిలోనూ ఇది ఉన్నప్పటికీ కొంతమందిలో ఈ ఆటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే ఎదుటివారు వీరిని రూడ్ అనుకునేంతగా.. ‘అబ్బో వీరికి చాలా పొగరు..’ అనుకునేంతగా.. అయితే ఈ ఆటిట్యూడ్ ప్రాబ్లం కూడా వారి వారి రాశుల్ని బట్టే ఉంటుందట. అలాంటి 4 రాశిచక్రాలు ఏంటో ఓ సారి చూడండి.. అందులో మీరుంటే.. దాన్నుండి ఎలా బయటపడాలో ప్లాన్ చేసుకోండి.
కుంభం
కుంభరాశి వారు కొన్ని కారణాల వల్ల ఇతర వ్యక్తుల కంటే తమని తాము ఉన్నతంగా భావిస్తారు. తాము మిగతా వారికంటే వేరని గుడ్డిగా నమ్ముతారు. దీనివల్ల వీరికి జీవితంలో విరక్తిని కలిగిస్తుంది. కొన్నిసార్లు వీరు చాలా బిట్టర్ పర్సన్స్ గా మారతారు. దీనివల్ల ఇతరులతో దూరంగా ఉంటారు. ఇలాంటి వారు కనుక మీ సహోద్యోగులు అయితే, వ్యక్తిగత స్థాయిలో వీరికి దూరంగా ఉండడమే మంచిది.
కన్యరాశి
కన్యారాశి వారు అన్నీ తెలిసిన వారిలా వ్యవహరిస్తారు. తాము ఇతరులపై ఆధిపత్యం చెలాయించగలరని వారు భావిస్తారు. వారు మిగతావారిని బహిరంగంగా విమర్శిస్తారు. ఇతరులతో చాలా కఠినంగా ఉంటారు. బాధిస్తారు. కన్యరాశివారు ఫర్ ఫెక్షనిస్టులు, మేజర్ ఆటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది. దీంతో తమవారిని బాధపెడతారు.
మిథునం
ఈ రాశి వారు నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు చాలా చికాకు కలిగిస్తారు. ఇది వారికి చాలా కష్టమైన పని. అయితే చాలాసార్లు రాంగ్ థింగ్స్ ని ఎంచుకోవడంతో ముగుస్తుంది. దీంతో వారు అనిశ్చితంగా ఉంటారు. ఆందోళనతో ఉంటారు. మిథున రాశి వారు నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడల్లా దానినుంచి లాభనష్టాలేంటి అని ఆలోచిస్తారు.
మేషం
ఈ రాశి వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు చెడు వైఖరిని కలిగి ఉంటారు. వారు తమ చుట్టూ ఉన్నవారికి ఆందోళన, ఒత్తిడిని కూడా అనుభూతి చెందుతారు. వారు దూకుడుగా, చిరాకుగా ఉంటారు. ఆ వైఖరితో ఎదుటివారి నాశనం చేయడంలో సిద్ధహస్తులు. వీరితో వేగాలంటే చాలా ఓపిక అవసరం. టైం స్పెండ్ చేయాలి.