జరగబోయే చెడు ఈ రాశులకు ముందే తెలిసిపోతుంది..!
అలా కొందరికి కొన్ని శక్తులు ఉంటాయట. వారికి జరగబోయే చెడు ముందే తెలిసిపోతూ ఉంటుందట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులకు కూడా.. చెడు ముందే తెలుస్తుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

astrology
ప్రతి ఒక్కరి జీవితంలో మంచి, చెడు జరుగుతూ ఉంటాయి. మనలో చాలా మంది ఏదైనా చెడు జరగబోయే ముందు.. ఏదో జరిగేలా ఉంది అంటూ కొందరు ముందే ఊహిస్తూ ఉంటారు. అయితే.. వారు చెప్పేది ఎవరూ నమ్మరు. కానీ.. నిజంగా వారు చెప్పినట్లే జరుగుతుంది. అలా కొందరికి కొన్ని శక్తులు ఉంటాయట. వారికి జరగబోయే చెడు ముందే తెలిసిపోతూ ఉంటుందట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులకు కూడా.. చెడు ముందే తెలుస్తుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..
కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు. ఇలా వీరు ఏడ్చే విధానం ఇతరులకు చిరాకు కలిగిస్తూ ఉంటుంది. అయితే.. వీరు ఏదైనా చెడు జరగబోతోంది అంటే.. ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. ఎవరైనా చెడు వార్త వారికి చెప్పాలని వెళితే.. వారు దానిని ముందుగానే పసిగట్టగలరు. చెడు మాత్రమే కాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిని కూడా వీరిని గుర్తించగలరు. ఈ రాశివారికి ఉన్న శక్తి అలాంటిది. వీరు ముందుగానే ఆ విషయాలను గ్రహించగలరు. వారికి చెప్పక్కర్లేదు.. అర్థమైపోతుంది.
2.వృశ్చిక రాశి..
ఈ వృశ్చిక రాశివారు కూడా.. చెడు వార్తలను ముందుగానే పసిగట్టగలరు. వీరిని ఎవరూ మోసం చేయలేరు. పరిసరాలను బట్టి.. ఆ పరిస్థితులను బట్టి జరగబోయే చెడును వారు గుర్తించగలరట. ఏమీ జరగలేదు అని వీరిని నమ్మించలేరు. ఆటోమెటిక్ గా అక్కడ ఏం జరిగిందో వారు అర్థం చేసుకోగలరు. వీరి వద్ద నిజాలను దాచలేరు. అందరికన్నా ముందే.. వీరు ఆ చెడును గ్రహించగలరు.
3.మీన రాశి..
ఈ రాశివారికి భవిష్యత్తులో ఏం జరుగుతోంది అనేది.. కలల రూపంలో ముందుగానే తెలిసిపోతుందట. వారికి కలలో వచ్చినదే... నిజ జీవితంలో ఎక్కువగా జరుగుతుందట. ముఖ్యంగా చెడు జరిగినట్లు వచ్చే కలలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయట. అందుకే.. వీరికి ముందుగానే జరగపోయే విషయాలు తెలిసిపోతూ ఉంటాయట. వీరికి అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతుండటంతో.. వీరు ఎప్పుడూ కాస్త భయం భయంగా ఉంటారట.