2025లో మొదటి సూర్య గ్రహణం, ఈ నాలుగు రాశుల లైఫే మారిపోతుంది
జోతిష్యశాస్త్రం ప్రకారం 2025లో మొదటి సూర్య గ్రహణం శని సంచారం రోజున రాబోతుంది. కాగా... దీని ప్రభావం నాలుగు రాశులకు శుభ ఫలితాలను అందించనుందట. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...
మార్చి 29, 2005లో మొదటి సూర్య గ్రహణం సంభవించనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2:21 నుండి సాయంత్రం 6:14 వరకు గ్రహణం ఉంటుంది. రాత్రి 11 గంటలకు శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. కాగా.. ఈ సూర్య గ్రహణ ప్రభావం నాలుగు రాశులకు అదృష్టాన్ని తీసుకురానుందట. మరి ఆ రాశులేంటో చూద్దాం...
ధనస్సు రాశి...
శని సంచారం ధనస్సు రాశివారికి ఆర్థిక లాభాలను తెచ్చి పెడుతుంది. ఊహించని విధంగా ఈ రాశివారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు మొదలుపెట్టవచ్చు. వ్యాపారాల్లోనూ విజయం సాధిస్తారు. ఏది చేసినా విజయం సాధించగలరు.
తుల రాశి...
శని సంచారం తుల రాశి వారికి చాలా శుభప్రదం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పాత పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. ఈ రాశివారికి కూడా.. ఈ సమయంలో లాభాలు అందుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు.
మీన రాశి...
శని సంచారం మీన రాశి వారికి ఆర్థిక లాభాలను తెస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు మొదలుపెట్టవచ్చు. మంచి విజయం సిద్ధిస్తుంది. వ్యాపారాలు మొదలుపెట్టినా... మంచి లాభాలు చూస్తారు.
మిథున రాశి..
మిథున రాశి వారికి 2025 చాలా శుభప్రదమైన సంవత్సరం. అన్ని ప్రయత్నాలలో విజయం సిద్ధిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. ఇల్లు కొనాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది.