తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు
వైఎస్ఆర్‌సీపీకి చెందిన రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నేతల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు పై ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. సజ్జల రామకృష్ణారెడ్డితో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవాళ భేటీ అయ్యారు.
తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణు వర్గాల మధ్య వివాదం తాడేపల్లికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారంనాడు సమావేశమయ్యారు. రామచంద్రాపురంలో చోటు చేసుకున్న పరిణామాలపై సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు.
తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు
రామచంద్రాపురంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ లో మంత్రి చెల్లుబోయిన వేణుతో చర్చించారు. రామచంద్రాపురం మున్సిపల్ వైఎస్ చైర్మెన్ శివాజీ ఆత్మహత్యాయత్నం ఘటనను కూడ పిల్లి సుభాష్ చంద్రబోస్ సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం సాగుతుంది. మరో వైపు తన అనుచరులపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన ఘటనలను కూడ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు.
తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు
రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో కూడ చెల్లుబోయిన వేణుగోపాల్ పోటీ చేస్తారని ఇటీవలనే వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రకటించారు.ఈ ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులకు మింగుడు పడలేదు. పార్టీ నేతలతో మిథున్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి కూడ పిల్లి సుభాష్ చంద్రబోస్ దూరంగా ఉన్నారు.
తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు
నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సమావేశం గురించి తనకు తెలియదని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి తన కొడుకు సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు.
తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు
గత ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట నుండి పోటీ చేశారు. రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణు పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు దఫాలు రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసిన విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గట్టి పట్టుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పట్టు కోసం పిల్లి సుభాష్ చంద్రబోస్ , చెల్లుబోయిన వేణు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది.ఈ క్రమంలోనే రామచంద్రాపురంలో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు పాల్పడుతున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నీ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఘనత కూడ సుభాష్ వర్గానికి ఉందని వేణు ఆరోపిస్తున్నారు.