MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • జగనన్నను వదలని చెల్లెలు: వైసీపీ పతనానికి కారణమదేనని కుండబద్దలు కొట్టిన షర్మిల

జగనన్నను వదలని చెల్లెలు: వైసీపీ పతనానికి కారణమదేనని కుండబద్దలు కొట్టిన షర్మిల

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ పతనానికి జగన్ కారణమని కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో వైఫల్యం అనంతరం అసెంబ్లీకి హాజరుకాకపోవడం, రాష్ట్ర సమస్యలను పరిష్కరించకపోవడంపై నిప్పులు చెరిగారు.

3 Min read
Galam Venkata Rao
Published : Jul 29 2024, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
YS Sharmila

YS Sharmila

వైసీపీ, వైఎస్‌ షర్మిల మధ్య సోషల్‌ మీడియాలో పెద్ద వార్‌ కొనసాగుతోంది. షర్మిల విమర్శలు, వాటికి వైసీపీ కౌంటర్లు కొనసాగుతున్నాయి. వైసీపీ సైన్యమంతా దండెత్తుతున్నా షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రతి అంశంపైనా స్పందిస్తోంది. వైసీపీ ఒక్కటి అంటే షర్మిల అంతకు మించి ఇచ్చిపడేస్తోంది. 

25
ys jagan

ys jagan

తాజాగా షర్మిలపై వైసీపీ సోషల్‌ ఘాటు విమర్శలు చేసింది. షర్మిల చంద్రబాబు ఏజెంటులా రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది. 
‘‘చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికీ, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించి వారికోసం పనిచేసేవారికీ మధ్య తేడా ఉంటుంది షర్మిల. మీ మాటలు చూస్తే జగన్‌ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండి, మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే… మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్‌ గారిని తిట్టడం.

దివంగత మహానేత, మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే.. ఎప్పుడైనా నోరు విప్పారా? రాష్ట్రంలో టీడీపీ హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? పావురాల గుట్టలో పావురమైపోయాడని వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో  మీరు కలిసి నడవడం లేదా? తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి.. అక్కడ నుంచి  పారిపోయి ఇక్కడకు రాలేదా? 

మీకన్నా పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? ఇంతకీ మీరు పోస్టు చేసిన ట్వీట్‌ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా?’’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రశ్నలు సంధించింది.

35
ys sharmila

ys sharmila

ఈ విమర్శలపై తాజాగా వైసీపీ కౌంటర్ ఇవ్వగా షర్మిల స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు.

‘‘జగన్ మోహన్ రెడ్డీ అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడు.’’ అని షర్మిల పేర్కొన్నారు.

45
YS Sharmila

YS Sharmila

అలాగే, ‘‘సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు..! కాబట్టే తప్పు అన్నాం! చట్టసభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం!

వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి  వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్‌కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు’’ అని షర్మిల స్పష్టం చేశారు.

55
YS Jagan

YS Jagan

ఇంకా, ‘‘అసలు వైసీపీలో వైఎస్సార్‌ను, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. కనుక వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ. 

వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి.. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మరి, మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా? రూ.3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. రూ.4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..?

మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టుపెట్టారు!

మీ అహంకారమే మీ పతనానికి కారణం!’’ అని వైసీపీకి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
వై. ఎస్. షర్మిల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : ఒకటి కాదు వరుసగా రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే
Recommended image2
IMD Rain Alert : 'సెన్యార్' తుపాను లోడింగ్..? ఏపీ తీరంవైపే దూసుకొస్తుందా..?
Recommended image3
బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం, అంత‌లోనే వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved