MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పార్టీలో భారీ మార్పులకు ఛాన్స్..

YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పార్టీలో భారీ మార్పులకు ఛాన్స్..

YSRCP: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి అదేంటో ఈ వార్తలో చూసేద్దాం. 

2 Min read
Author : Pavithra D
Published : Oct 18 2025, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైసీపీలో భారీ మార్పులు..
Image Credit : YS Jagan Twitter

వైసీపీలో భారీ మార్పులు..

వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకునే దిశగా అడుగులు పడనున్నాయి. ఈ మేరకు పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల తర్వాత జగన్.. పార్టీ పునర్నిర్మాణం, స్థానిక నాయకత్వంపై లోతైన సమీక్ష చేపట్టారు. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు, కొత్త వ్యూహాలతో పార్టీని పునర్నిర్మించాలని జగన్ ఆలోచిస్తున్నారట.

25
ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ
Image Credit : YS Jagan Twitter

ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ

2024 ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న ఓటమితో జగన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఈ ఓటమి వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు జిల్లావారీగా సమావేశాలు, నాయకులతో మీటింగ్స్ చేపట్టారు పార్టీ అధినేత. స్థానిక స్థాయిలో అసంతృప్తి, కమ్యూనికేషన్ లోపం, ప్రజలతో మమేకం కానీ అంశాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజలతో మమేకమయ్యే యువ నేతలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

Related Articles

Related image1
Andhra Pradesh : ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులివే.. ఈ ప్రాంతాలకు మహర్ధశ
Related image2
Andhra Pradesh: ఏపిలో ల్యాండ్ అయిన ప్ర‌ధాని.. మోదీ రాక‌తో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
35
కడపలో మారనున్న సమీకరణాలు
Image Credit : YS Jagan Twitter

కడపలో మారనున్న సమీకరణాలు

జగన్ నియోజకవర్గం అయిన కడప జిల్లాలో త్వరలోనే సమీకరణాలు మారనున్నట్టు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిపై గత కొంతకాలంగా వివాదాలు, కేసులు చుట్టుముట్టాయి. ఇక అవి కాస్తా పార్టీ ఇమేజ్‌కి ప్రతికూలంగా మారినట్లు అంచనా. దీనికి బదులుగా యువనేత దుశ్యంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు వైఎస్ జగన్. జమ్మలమడుగు ప్రాంతంలో ఆయనకు ఉన్న బలమైన ప్రజాధరణ, రెడ్డి వర్గం మద్దతు కారణంగా దుశ్యంత్ రెడ్డి పేరు ఇప్పుడు పార్టీలో గట్టి చర్చకు దారి తీసింది.

45
అవినాష్ రెడ్డికి కొత్త బాధ్యతలు ఇచ్చే ఛాన్స్
Image Credit : YS Jagan Twitter

అవినాష్ రెడ్డికి కొత్త బాధ్యతలు ఇచ్చే ఛాన్స్

పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా అవినాష్ రెడ్డిని పులివెందుల నుంచి తప్పించి, జమ్మలమడుగు లేదా మిడుకూరు బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచన జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా వైసీపీలో అంతర్గత సమతుల్యతను కాపాడేందుకేనని సమాచారం. అవినాష్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టకుండా తగిన పరిపాలనా లేదా రాజకీయ బాధ్యతలు ఇవ్వాలనే ప్రణాళికను రచిస్తున్నారట వైఎస్ జగన్.

55
యువ నాయకత్వం వైపు వైసీపీ దృష్టి
Image Credit : YS Jagan Twitter

యువ నాయకత్వం వైపు వైసీపీ దృష్టి

ప్రజలతో మమేకమైయ్యే నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారు. యువతతో మమేకమైన పార్టీగా వైసీపీని తీర్చిదిద్దాలని చూస్తున్నారు. దుశ్యంత్ రెడ్డి వంటి నాయకులను ముందుకు తెచ్చి, కొత్తతరం నాయకత్వం ద్వారా ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి కొత్త ఊపుని తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు వైఎస్ జగన్.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image2
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
Andhra Pradesh : ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులివే.. ఈ ప్రాంతాలకు మహర్ధశ
Recommended image2
Andhra Pradesh: ఏపిలో ల్యాండ్ అయిన ప్ర‌ధాని.. మోదీ రాక‌తో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved