MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 18 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: జగన్
Image Credit : YSR Congress Party/X

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: జగన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం కూడా లేకుండా అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు మోహరించి, తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని జగన్ ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రిజర్వేషన్లు, నామినేషన్ల గడువుపై అభ్యంతరాలు
Image Credit : X- Jagan Mohan Reddy

రిజర్వేషన్లు, నామినేషన్ల గడువుపై అభ్యంతరాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రకటన, నామినేషన్ల గడువుపై వైసీపీ అధినేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు రిజర్వేషన్లు ప్రకటించి, 24 గంటల్లోనే నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పడం ప్రతిపక్ష అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయమని విమర్శించారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు. నామినేషన్ల దశలోనే అడ్డంకులు ఎదురైతే ఎన్నికల నిర్వహణపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు.

గతంలో తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్న సమయంలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు జరిగినప్పటికీ తాము ఎన్నికలను ఎదుర్కొన్నామని జగన్ గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం చూపడం లేదని విమర్శించారు.

34
పుంగనూరులో ఘర్షణలు.. పరస్పరం ఆరోపణలు
Image Credit : X/YSR Congress Party

పుంగనూరులో ఘర్షణలు.. పరస్పరం ఆరోపణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విష‌యం తెలిసిందే. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఈ ఘటనకు వైసీపీ కార్యకర్తలే కారణమని టీడీపీ నేతలు ఆరోపించగా, తమ పార్టీ ఎంపీపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా మిథున్ రెడ్డి వందలాది మంది అనుచరులతో అక్కడికి రావడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఇరు పార్టీలు తమ వాదనలను వినిపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం రిపోర్టులు కోరినట్లు స‌మాచారం.

44
పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రత్యక్ష ప్రసారానికి డిమాండ్
Image Credit : YS Jagan Twitter

పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రత్యక్ష ప్రసారానికి డిమాండ్

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు పోలింగ్ బూత్‌లతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా లైవ్ టెలికాస్టింగ్ ఏర్పాటు చేయాలని వైసీపీ కోరినట్లు జగన్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా అన్ని కీలక దశలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తాము చేసిన విజ్ఞప్తులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు జగన్ తెలిపారు. అయితే, కేవలం స్పందించడం సరిపోదని, నిష్పాక్షికంగా వ్యవహరించాలంటే తమ డిమాండ్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా స్వతంత్రంగా పనిచేయాలని అన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించామని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించడం, నామినేషన్లకు తగిన అవకాశాలు ఇవ్వడం, పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు పారదర్శకత పాటించడం ద్వారా ప్రజాస్వామ్యంపై విశ్వాసం నిలబెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆయన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu
Recommended image2
Navratri Celebrations: బెజవాడలో రాగా దాండియా ఉత్సవ్ 2.0.. ఘనంగ నవరాత్రి వేడుకలు
Recommended image3
Now Playing
చంద్రబాబు వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడకండి | YS Jagan On AP Police | AP Localbody Elections 2026
Related Stories
Recommended image1
బంగారం పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
భార‌త‌దేశంలో తొలిసారి విద్యుత్ ఎక్క‌డొచ్చింది.? అప్ప‌ట్లో క‌రెంట్ బిల్లు ఎంత ఉండేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved