- Home
- Andhra Pradesh
- YS Jagan: జగన్ సంచలన నిర్ణయం.. దసరా తర్వాత ఏపీ రాజకీయాల్లో అలజడి తప్పదా?
YS Jagan: జగన్ సంచలన నిర్ణయం.. దసరా తర్వాత ఏపీ రాజకీయాల్లో అలజడి తప్పదా?
YS Jagan: వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత జగన్ ప్రజా క్షేత్రంలోకి పూర్తి స్థాయిలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం

జగన్ సరికొత్త వ్యూహం
ఏపీ రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డి అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి కావడంతో ప్రజల మధ్యకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇకపై నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
మెడికల్ కాలేజీల వివాదం నేపథ్యంలో
కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. తన ప్రభుత్వంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి వచ్చినట్లు, ఆరు కాలేజీలను దశలవారీగా పూర్తిచేశారని జగన్ చెప్పుకొచ్చారు. ఈ వివాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఎవరైనా టెండర్లలో పాల్గొన్నా.. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని జగన్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
దసరా తర్వాత ముహుర్తం.?
దసరా తర్వాత జగన్ రాష్ట్రస్థాయి నిరసన దీక్ష నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నంద్యాల లేదా విజయవాడలో నిరాహార దీక్ష జరపాలని ఆలోచిస్తున్నారని టాక్. అవసరమైతే రాజీనామాల అస్త్రాన్ని కూడా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి జగన్ తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.