MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • APL Auction : ఇక క్రికెట్ ఆడే తెలుగమ్మాయిలపై కాసుల వర్షం

APL Auction : ఇక క్రికెట్ ఆడే తెలుగమ్మాయిలపై కాసుల వర్షం

Andhra Premier League : ఆంధ్ర ప్రదేశ్ లో క్రికెట్ ఆడే అమ్మాయిల దశ తిరిగిపోనుందా..? ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వారికోసం కీలక నిర్ణయం తీసుకుందా? అంటే టీమిండియా ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ అవుననే అంటున్నారు.  

3 Min read
Arun Kumar P
Published : Nov 07 2025, 01:21 PM IST| Updated : Nov 07 2025, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు మహిళా క్రికెటర్లకు బంపరాఫర్
Image Credit : ANI

తెలుగు మహిళా క్రికెటర్లకు బంపరాఫర్

Andhra Pradesh Cricket : క్రికెట్ ఇకపై జెంటిల్ మెన్ గేమ్ మాత్రమే కాదు... జెంటిల్ ఉమెన్ గేమ్ కూడా. పురుషాదిక్య ఆటల్లో ఒకటైన క్రికెట్ లో అమ్మాయిల హవా మామూలుగా లేదు... ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవకాశం వస్తే ఆడవాళ్ళు ఆటల్లోనూ అద్భుతాలు చేయగలరని నిరూపించారు టీమిండియా ఉమెన్ క్రికెటర్స్. ప్రస్తుతం ఉమెన్ క్రికెట్ కు ఆదరణ పెరుగుతుండటంతో తల్లిదండ్రులు కూడా అబ్బాయిలనే కాదు అమ్మాయిలను కూడా క్రికెట్ ఆడించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే క్రికెటర్ గా రాణిస్తున్న అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. మంచి గుర్తింపు దక్కడమే కాదు మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది.

26
APL లో వేలంపాట..?
Image Credit : X/Telugu Desam Party

APL లో వేలంపాట..?

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) కోసం క్రికెటర్ల వేలంపాట నిర్వహించడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) సిద్దమవుతోంది. అంటే ఈ APL లో ఆడే ఆంధ్రా ఉమెన్స్ క్రికెటర్లకు టాలెంట్ ఆధారంగా భారీగా డబ్బులు లభిస్తాయి. ఏపిఎల్ ఆక్షన్ గురించి టీమిండియా ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ వెల్లడించారు.

Related Articles

Related image1
తొలి ప్రపంచకప్: భారత స్పిన్ యూనిట్‌కు ఎక్స్ ఫ్యాక్టర్‌గా శ్రీ చరణి
Related image2
శ్రీ చరణికి షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితా ఇదే
36
మిథాలీరాజ్ ఇంకేమన్నారంటే..
Image Credit : X/Telugu Desam Party

మిథాలీరాజ్ ఇంకేమన్నారంటే..

ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజయం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టింది తెలుగమ్మాయి శ్రీ చరణి. ఆమెతో పాటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా వచ్చారు. ఈ క్రమంలో మిథాలీ ఉమెన్స్ క్రికెట్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ శ్రీ చరణిని కొనియాడారు.

ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ని టీమిండియా గెలుచుకోవడంలో శ్రీ చరణి కీలక పాత్ర పోషించింది... బంతితో అద్భుతాలు చేసిందన్నారు మిథాలీరాజ్. వరల్డ్ కప్ మెగా టోర్నీలో అన్ని మ్యాచులు ఆడిన శ్రీ చరణి మెరుగైన ప్రదర్శన చేసిందన్నారు. తన ఆటతో శ్రీ చరణి కోట్లాదిమంది అభిమానులకు సంపాదించుకుందన్నారు. తాను కామెంట్రీ చేసే సమయంలో చరణి బౌలింగ్ ను ప్రశంసిస్తూ అనేకమంది కామెంట్ చేసేవారని పేర్కొన్నారు. డబ్ల్యుపిఎల్ లో కూడా శ్రీ చరణి అద్బుతంగా ఆడిందన్నారు. ఇలాంటి టాలెంటెడ్ క్రికెటర్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణమని మిథాలీ రాజ్ అన్నారు.

మహిళల క్రికెట్ లో పరిస్థితులు మారిపోయాయని... ఏసిఏ కూడా మహిళా క్రికెటర్లకు చాలా సహకరిస్తోందన్నారు మిథాలి. రాష్ట్రంలో ఉమెన్స క్రికెటర్లను జిల్లా స్థాయినుండి ప్రోత్సాహిస్తోంది...వారిని ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. అమ్మాయిలకోసం కూడా ఏపిఎల్ నిర్వహిస్తున్నారన్నారు. ఏసిఏ ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్దతో ఉమెన్స్ క్రికెట్ ను ప్రోత్సహిస్తున్నారని మిథాలీ రాజ్ అన్నారు.

ఉమెన్స్ క్రికెట్‌ను ప్రోత్సహించటానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బాగా పని చేస్తోంది.
నారా లోకేష్ గారు ఉమెన్స్ క్రికెట్ ప్రొమోట్ చేయటానికి ఎంతో సహకరిస్తున్నారు.

- మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ #APWelcomesShreeCharani#ICCWomensWorldCup2025#TeamIndia#NaraLokesh#AndhraPradeshpic.twitter.com/voG2Wof5I3

— Telugu Desam Party (@JaiTDP) November 7, 2025

46
చంద్రబాబుతో శ్రీ చరణి, మిథాలి రాజ్ భేటీ
Image Credit : X/Telugu Desam Party

చంద్రబాబుతో శ్రీ చరణి, మిథాలి రాజ్ భేటీ

ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం తర్వాత స్వరాష్ట్రానికి విచ్చేసిన శ్రీ చరణిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. శ్రీ చరణి మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తో కలిసి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు.. వీరికి స్వయంగా మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఇద్దరికీ పుష్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు లోకేష్. తర్వాత ఆయనే వారిని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లారు... వారిని అభినందించిన చంద్రబాబు కూర్చోబెట్టి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తన వరల్డ్ కప్ అనుభవాలను సీఎంతో పంచుకున్నారు శ్రీ చరణి. ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని... మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు కొనియాడారు. 

 

56
శ్రీచరణికి నగదు, ఇంటిస్థలం, ఉద్యోగం...
Image Credit : X/BCCI

శ్రీచరణికి నగదు, ఇంటిస్థలం, ఉద్యోగం...

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత శ్రీ చరణికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను కలిసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతితో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చ.గ. స్థలం, రాష్ట్ర ప్రభుత్వం లో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

66
ఎయిర్ పోర్ట్ లో శ్రీ చరణికి ఘనస్వాగతం
Image Credit : X/Telugu Desam Party

ఎయిర్ పోర్ట్ లో శ్రీ చరణికి ఘనస్వాగతం

గన్నవరం ఎయిర్ పోర్టులో ఉమెన్స్ క్రికెటర్లు శ్రీ చరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌‌కు ఘన స్వాగతం లభించింది. వారికి స్వయంగా మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి స్వాగతం పలికారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కూడా వీరితో ఉన్నారు. విమానాశ్రయం నుండి భారీ ర్యాలీగా వారిని సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లారు. రోడ్డుపొడవునా ప్రజలు ఈ మహిళా క్రికెటర్లకు నీరాజనాలు పట్టారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
మహిళల క్రికెట్
క్రీడలు
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ
విశాఖపట్నం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved