Weather: మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే.. వాతావరణ శాఖ హెచ్చరిక
శివరాత్రికి.. 'శివ శివ అంటూ' చలి పోతుందనే సామెత ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా చలి తీవ్రత క్రమంగా తగ్గుతుతోంది. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉదయం చలిగా ఉంటున్నా మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత ఎక్కువుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది..

summer heat
వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వాయువ్య భారతదేశం నుంచి వస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని, రానున్న మూడు రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
summer heat
ఇటీవల కర్నూలులో ఏకంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫిబ్రవరిలోనే ఇలాంటి ఎండలు ఉంటే మార్చి, ఏప్రిల్‌లో ఎండలు దంచికొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో ఎండలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
summer heat
ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇక్కడ సుమారు 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
summer heat
ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఎండలో పనిచేసే వారు కచ్చితంగా టోపీలు, మెడలో కండువ వంటివి ధరించాలి. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా మంచి నీటితో పాటు, మజ్జిగ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు.