Navratri Celebrations: బెజవాడలో రాగా దాండియా ఉత్సవ్ 2.0.. ఘనంగ నవరాత్రి వేడుకలు
Navratri Celebrations: విజయవాడలో వేగా జ్యువెలర్స్, వైబ్ ఈవెంట్స్ నిర్వహించిన రాగా దాండియా ఉత్సవ్ 2.0 అట్టహాసంగా ముగిసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విజయవాడ దాండియా నైట్ రచ్చ రచ్చ: ఉదయ్ మాస్టర్ నృత్యాలు.. పంజాబీ ధోల్ అంబరాన్నంటిన సంబరాలు
కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ నగరం భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలతో కోలాహలంగా మారిపోయింది. తరం మారినా సాంప్రదాయాల విలువ తగ్గకుండా, నగర ప్రజలను ఏకం చేస్తూ వేగా జ్యువెలర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ విజయవాడ కళాత్మక హృదయాన్ని ఆవిష్కరించింది. సాంప్రదాయ దాండియా, గర్బా నృత్యాలతో పాటు సమకాలీన కళారూపాలను మేళవించి నిర్వహించిన ఈ వేడుక నగర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా సాగింది.
ఈ వేడుకలో విజయవాడ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ అండ్ టీమ్ అద్భుతమైన నృత్య రూపకాలతో స్టేజ్‌పై అలరించారు. ఒకవైపు సాంప్రదాయ పంజాబీ ధోల్ వాయిద్యాల గంభీర నాదం, మరోవైపు డీజేల సంగీత హోరు కలిసి కన్వెన్షన్ హాల్‌ను ఒక సరికొత్త లోకంగా మార్చేసాయి. యువత, మహిళలు, కుటుంబ సమేతంగా తరలివచ్చి సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ పండుగ ఉత్సాహాన్ని అంబరానికి చేర్చారు.
గుజరాతీ సంస్కృతికి ప్రతిరూపమైన ఈ దాండియా విజయవాడ వాసులకు అందించినందుకు వేగా జ్యూవెలరీ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నగర వాసులు...రోజంతా ఎదురయ్యే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను ఈ దాండియా ద్వారా పోందామని ఇంతటి చక్కటి కార్యక్రమం ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించాలని కోరారు.
ముఖ్య అతిథిగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
వైభవంగా జరిగిన వేడుకకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్న ఆయన నిర్వాహకుల ప్రయత్నాన్ని, నగర ప్రజల ఉత్సాహాన్ని విశేషంగా కొనియాడారు. వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్క అతిథికి నిర్వాహకులు సాంప్రదాయ హారతి ఇచ్చి, తిలకం దిద్ది ఎంతో ఆత్మీయంగా ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వాతావరణం ఉట్టిపడేలా నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా ఫుడ్ స్టాల్స్, ఫోటో బూత్‌లు, కాంటెస్ట్‌లు
ఉత్సవానికి విచ్చేసిన అతిథులకు సాంప్రదాయ హారతి, తిలకంతో ఘన స్వాగతం పలికారు నిర్వహకులు. బెజవాడ ప్రత్యేక రుచులను అందిస్తూ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, మాక్‌టైల్ కౌంటర్లు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ఫేస్ పెయింటింగ్, రంగురంగుల గాజుల దుకాణాలు, మ్యాగ్నెటిక్ ఫోటో బూత్, ఆకర్షణీయమైన సెల్ఫీ పాయింట్లు పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేశాయి. సాంప్రదాయాల నేపథ్యంలో నిర్వహించిన పలు పోటీలు వేడుకల్లో మరింత జోష్ నింపాయి.
సాంస్కృతిక బంధాలను బలపరచడమే మా లక్ష్యం: వేగా జ్యువెలర్స్ యాజమాన్యం
ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నవీన్ వనమా మాట్లాడుతూ.. "నవరాత్రి అనేది భక్తి, సాంప్రదాయం, అందరూ కలిసి జరుపుకొనే ఒక గొప్ప పండుగ. విజయవాడ ప్రజల కళాభిరుచికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ వనమా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడుతూ, నగర ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే ఈ వేడుకను ఇంత ఘనంగా ప్లాన్ చేశామని, బెజవాడ ప్రజల నుంచి వచ్చిన స్పందన అద్భుతమని కొనియాడారు.
ఆధునిక హంగులు అద్దుకున్నా, మన మూలాలను మరువకుండా విజయవాడ కళా వైభవాన్ని చాటిచెప్పిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ నగరవాసుల గుండెల్లో ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

