చంద్రబాబుకు తలనొప్పి: నాని వర్సెస్ బుద్దా వెంకన్న

First Published 14, Jul 2019, 3:49 PM IST

 అధికారానికి దూరమైన  టీడీపీ నుండి  ఒక్కొక్కరుగా నేతలు తమ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మరో వైపు  నాయకత్వంపైనే కొందరు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడం చంద్రబాబుకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి

విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారంనాడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ విజయవాడ సిటీలోని నేతల మధ్య చోటు చేసుకొన్న విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ఇటీవల కాలంలో అగాధం పెరిగినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగుల్ మీరాకు నాని అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బుద్దా వెంకన్న వర్గీయులు అనుమానిస్తున్నారు.

ఎన్నికల ముందు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు దక్కదని తెలిసిన సమయంలో నాగుల్ మీరా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.ఈ సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని నాగుల్ మీరాను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు.  ఆ సమయం నుండి నాగుల్ మీరా కేశినేని నానితో ఉంటున్నారు.

బుద్దా వెంకన్న కూడ కేశినేని నానిని వదల్లేదు. నానికి తీవ్రమైన స్థాయిలోనే కౌంటరిచ్చారు. పీఆర్పీలో ఉన్న సమయంలో వ్యవహరించిన విధంగా టీడీపీలో నీ ఆటలు సాగవని కూడ నానిపై బద్దా వెంకన్న కౌంటరిచ్చారు.

ఆదివారం నాడు బుద్దా వెంకన్నను లక్ష్యంగా చేసుకొని నాని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ప్రత్యర్థిపై పోరాటం చేయాల్సిన సమయంలో ఈ రకంగా స్వంత పార్టీలో నేతలే ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడంపై విజయవాడ నేతల మధ్య విభేదాలు ఏ మేరకు చేరుకొన్నాయో అర్ధమౌతోంది.

మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని పార్టీ నాయకత్వంపై అలక వహించిన కేశినేని నాని ఆ తర్వాత తన పరంపరను కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై కూడ ఆయన ఇటీవల విమర్శలు చేశారు.

కేశినేని నాని బీజేపీలో చేరుతారని కూడ ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని నానితో పాటు ఆయన అనుచరులు ఖండించారు. పార్టీ నేతలపై కానీ, నాయకత్వంపైన కానీ అసంతృప్తి ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చిస్తే ఫలితం ఉంటుంది. కానీ, ఈ తరహాలో బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా ఆ ప్రభావం పార్టీపై ఉంటుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

టీడీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బజారుకెక్కిన నేతలపై చంద్రబాబునాయుడు చర్యలు తీసుకొంటారా అంటే అనుమానమే. అయితే విజయవాడ నేతల మద్య అభిప్రాయభేదాలకు చెక్ చెప్పాల్సిన పరిస్థితులు అనివార్యంగా నెలకొన్నాయి. నేతల మధ్య అభిప్రాయభేదాలు ఇలానే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

loader