కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్యకి ఆ స్పెషల్ ట్యాలెంట్..ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలుపొంది... మోదీ 3.0 కేబినెట్‌లో పదవి దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విమానా యాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి. కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడు. ఉత్తరాంధ్రలో కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఎదిగారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలుపొంది... మోదీ 3.0 కేబినెట్‌లో పదవి దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విమానా యాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన 16 మంది ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు సీనియర్.
26 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కింజరాపు రామ్మోన్నాయుడు వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత జరిగిన 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి ఎర్రన్నాయుడు సైతం వరుసగా నాలుగుసార్లు ఒకే పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. రామ్మోహన్ సైతం అదే పంథాలో ముందుకు సాగుతున్నారు.
రామ్మోహన్ నాయుడు మూడుసార్లు ఒకే పార్టీ నుంచి ఒకే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే, మూడుసార్లు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపైనే గెలుపొందారు. 2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్‌పై, ఈసారి పేరాడ తిలక్‌పై 3.27 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న జన్మించారు. తల్లిదండ్రులు కింజరాపు ఎర్రన్నాయుడు-విజయకుమారి. 3వ తరగతి వరకు శ్రీకాకుళంలో చదివారు. 4, 5 తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో చదివారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలో ఉన్నత విద్య చదివారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎంబీఏ పూర్తిచేశారు. స్టడీస్ పూర్తిచేసుకొని సింగపూర్‌లో ఓ ఏడాది పాటు ఉద్యోగం చేశారు.
తండ్రి ఎర్రన్నాయుడి మరణంతో 2012లో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీచేసి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మాతృభాష తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించగల సామర్థ్యం రామ్మోహన్ సొంతం. ఉత్తరాంధ్ర సమస్యలపై అనేక సార్లు లోక్‌సభలో గళం విప్పారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు- ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై పార్లమెంటులో గళం వినిపించి.. తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలోనూ లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.
రామ్మోహన్ నాయుడి కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది. బాబాయి అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి. మామ బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమండ్రి సిటీ) ఎమ్మెల్యేలు. సోదరి ఆదిరెడ్డి భవాని 2019 నుంచి 2024 వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
రామ్మోహన్‌కు 2017 జూన్‌లో బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రీ శ్రావ్యతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె. బండారు శ్రావ్య ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు అప్పలనాయుడు మనవరాలు.
శ్రావ్య విశాఖపట్నంలోని గాయత్రీ పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. భరత నాట్యంలో ప్రావీణ్యం ఉంది.