తిరుమలలో లడ్డు మాత్రమే కాదు.. మీకు పనికొచ్చే చాలా ప్రాడక్ట్స్ TTDనే తయారుచేస్తుంది తెలుసా?
తిరుమల వెళ్లే భక్తులు శ్రీవారిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం, పూజా వస్తువులు, పిల్లలకు నచ్చిన బొమ్మలు, ఇతర సామగ్రి చకచకా కొనేస్తారు. తిరుమలలో ఇంకా ఏమేం కొనవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా..? ఆ విశేషాలు ఈ స్టోరీలో చూసేద్దాం..
వైదిక సంస్కృతిలో గోవు అత్యంత పవిత్రమైన జంతువు. ఎందుకంటే, గోవు అన్ని దేవతలకు నివాసమని హిందువులు భావిస్తారు. హిందూ ఆచార వ్యవహారాలు, ఆరోగ్యంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆవు.
టీటీడీ ‘నమామి గోవింద’
పంచగవ్య అనేది మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆవుల నుండి వచ్చే 5 (పంచ) ఉత్పన్నాలు వాటి ఔషధ విలువల కారణంగా ఆయుర్వేదంలో విస్తృతంగా ‘పంచగవ్యాలు’గా ప్రసిద్ధి చెందాయి. ఆవుపేడ, గో మూత్రం, పాలు, పెరుగు, నెయ్యికి అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకించి దేశీ గోవుల ఉత్పత్తులకు అయితే ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో దేశీ అవులను సంరక్షించడంతో వాటి ఉత్పత్తుల ప్రాధాన్యంపై విస్తృతమైన అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలో ఔషధ గుణాలున్న పంచగవ్య ఆధారిత మూలికా ఉత్పత్తులను ‘నమామి గోవింద’ బ్రాండ్ పేరిట ప్రజలకు అందిస్తోంది. ప్రతి ఉత్పత్తి జాగ్రత్తగా తయారుచేసి.. వివిధ ఉత్పత్తులుగా విక్రయిస్తోంది.
ధరణి, ధాత్రి, వైష్ణవి, వారాహీ ధూపాలు
తిరుమల తిరుపతి దేవస్థానం గో పదార్థాలతో ఐదు రకాల ధూప ఉత్పత్తులను తయారు చేస్తోంది. అవని ధూప చూర్ణం, ధరణి అగర్బతి, ధాత్రి సాంబ్రాణి కప్పులు, వైష్ణవి ధూప కర్రలు, వారాహి ధూప శంకువులు పేరుతో అగరుబత్తులు, ధూపపు కడ్డీలను తయారు చేసి విక్రయిస్తోంది. వీటి తయారీలో ఆవుపేడ, అగరు, వేప కూడా వినియోగిస్తారు. ఇవి ఉపయోగించడానికి సురక్షితమైనవి. వీటి నుంచి ఈ వెలువడే పొగ యాంటీ మైక్రోబియల్ మాదిరిగా పని చేస్తుంది. పరిసరాలను పవిత్రం చేస్తుంది.
పృథ్వీ విభూతి
సాంప్రదాయ పద్ధతుల ద్వారా ‘పంచ భూతాత్మక హోమ గుండాలలో’ ఆవు పేడ, ‘దుర్వా’ (గణేశుడికి సమర్పించే గడ్డి రకం), కర్పూరం, ఆవు నెయ్యిని కాల్చి.. టీటీడీ పృథ్వీ విభూతిని తయారు చేస్తోంది. ఈ విభూతిని నుదిటి పెట్టుకోవడం శుభప్రదం. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది.
ధన్షిక టూత్ పౌడర్
ఈ పళ్ల పొడి (టూత్ పౌడర్)ని ఆవు పేడ కాల్చిన తర్వాత వచ్చే బూడిద, రాతి ఉప్పు (సైంధవ లవణం), లవంగాలు (లవంగ్), అమలకి (ఇండియన్ మైరోబోలన్) ఇతర మూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారు చేస్తోంది. ఈ టూత్ పౌడర్‌ను క్రమం తప్పకుండా వాడటం వల్ల నోరు, చిగుళ్లు, దంతాలను వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు.
హిరణ్మయి హెర్బల్ ఫేస్ ప్యాక్
హిరణ్మయి హెర్బల్ ఫేస్ ప్యాక్‌ను పసుపు (హరిద్ర), మంజిస్తా, లోద్రా లాంటి మూలికలతో తయారు చేస్తారు. దీనిని ముఖంపై పూయడం ద్వారా మొటిమలు, వైట్ హెడ్స్, నల్లని మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతం అవుతుంది.
మహి హెర్బల్ సోప్
ఆవు మూత్రం స్వేదనం, నల్పమరాది తైలం, ఇతర మూలికలు, నాచురల్ ఫ్రాగ్రెన్సెస్‌తో మహి హెర్బల్ సోప్‌ను తయారు చేస్తారు. ఈ సబ్బు చర్మాన్ని రక్షించడంతో పాటు గ్లో, రంగు, ఛాయను మెరుగుపరుస్తుంది. మొటిమలను నివారించడానికి, చర్మంలో సూక్ష్మజీవులను కలిగించే వ్యాధిని నిర్మూలిస్తుంది.
కశ్యపి హెర్బల్ షాంపు
కశ్యపి హెర్బల్ షాంపూ హెయిర్ ప్రొటక్టర్‌లా పనిచేస్తుంది. సహజమైన హెయిర్ వాష్, కండీషనర్ అయిన ఈ షాంపూ తలలో చుండ్రును నివారిస్తుంది. ఆవు మూత్రం స్వేదనం (గో ఆర్క్), షికాకాయ్, సహజ సువాసన కలిగిన కొబ్బరి నూనె లాంటి పదార్థాలతో సాంప్రదాయ పద్ధతిలో దీన్ని తయారు చేస్తారు.
ఉర్వి నాజల్ డ్రాప్స్
జలుబు, తల నొప్పి నివారణకు ఉర్వి నాజల్ డ్రాప్స్ ఓ చక్కని ఔషధమని చెప్పవచ్చు. ఆవుపేడ, ఆవు పాలు, శొంఠి నూనెతో దీన్ని తయారు చేస్తారు. రోజూ తెల్లవారుజామున రెండు లేదా మూడు చుక్కలను గోరువెచ్చని రూపంలో రెండు నాసికా రంధ్రాల్లో వేసుకుంటే జలుబు, తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కళ్లు, చెవులు, ముక్కు పనితీరు మెరుగుపడుతుంది.
నందిని గో- అర్కా
స్వదేశీ జాతుల నుంచి తాజాగా సేకరించిన గో మూత్రాన్ని స్వేదనం చేసి ఆవిరిగా మార్చి అర్కా తయారు చేస్తారు. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులను నివారించడానికి గో-అర్కా ఉపయోగపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
భూమి హెర్బల్ ఫ్లోర్ క్లీనర్
భూమి ఫ్లోర్ క్లీనర్‌ని గో-అర్కా (ఆవు మూత్రం స్వేదనం), లెమన్ గ్రాస్ ఆయిల్, పైన్ ఆయిల్ లాంటి సహజ పదార్థాలతో తయారు చేస్తారు. ఇది సూపర్ ఎఫెక్టివ్. దీంతో ఫ్లోర్ క్లీన్ చేస్తే సూక్ష్మజీవుల భయం ఉండదు.
వాడిన పూలతో 7 రకాల అగర్బత్తులు
అలాగే, తిరుమల, తిరుపతిలోని ఇతర TTD ఆలయాల్లో శ్రీవారికి సమర్పించే పుష్పాలు (నిర్మల్య-ప్యూర్)ను ‘పుష్ప ప్రసాదం’ పేరుతో శ్రీవారి ఫోటో- ఫ్రేమ్‌లు, కీ చైన్‌లు, పేపర్ వెయిట్‌లు, డాలర్లు, పెన్ స్టాండ్‌ల తయారీలో వినియోగిస్తున్నారు.తిరుపతిలోని హార్టికల్చరల్ యూనివర్సిటీ సాంకేతిక సహకారంతో శాస్త్రీయ పద్ధతుల ద్వారా వివిధ రూపాల్లో శ్రీవారి పుష్ప ప్రసాదాన్ని భక్తులకు టీటీడీ అందిస్తోంది. స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించిన పుష్పాలను భద్రపరచేందుకు టీటీడీ చేసిన ఓ వినూత్న ఆలోచన ఇది అని చెప్పవచ్చు.
టీటీడీ పుష్ప ప్రసాదం
అలాగే, తిరుమల, తిరుపతిలోని ఇతర TTD ఆలయాల్లో శ్రీవారికి సమర్పించే పుష్పాలు (నిర్మల్య-ప్యూర్)ను ‘పుష్ప ప్రసాదం’ పేరుతో శ్రీవారి ఫోటో- ఫ్రేమ్‌లు, కీ చైన్‌లు, పేపర్ వెయిట్‌లు, డాలర్లు, పెన్ స్టాండ్‌ల తయారీలో వినియోగిస్తున్నారు.తిరుపతిలోని హార్టికల్చరల్ యూనివర్సిటీ సాంకేతిక సహకారంతో శాస్త్రీయ పద్ధతుల ద్వారా వివిధ రూపాల్లో శ్రీవారి పుష్ప ప్రసాదాన్ని భక్తులకు టీటీడీ అందిస్తోంది. స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించిన పుష్పాలను భద్రపరచేందుకు టీటీడీ చేసిన ఓ వినూత్న ఆలోచన ఇది అని చెప్పవచ్చు.