MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మరోసారి అల్పపీడన ముప్పు.. మూడు రోజులు వానలే వానలు..

మరోసారి అల్పపీడన ముప్పు.. మూడు రోజులు వానలే వానలు..

Telangana, Andhra Pradesh Weather Update: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

2 Min read
Author : Rajesh K
Published : Aug 25 2025, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరో మూడు రోజులు భారీ వర్షాలు..!
Image Credit : pinterest

మరో మూడు రోజులు భారీ వర్షాలు..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో లంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఒడిశా-పశ్చిమబెంగాల్, ఆంధ్ర తీరా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం నేడు (సోమవారం) ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.

25
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Image Credit : Getty

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం.. బంగాళఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో గణనీయంగా కనిపించనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజుల్లో మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

35
తెలంగాణలో రెయిన్ అలర్ట్
Image Credit : Asianet News

తెలంగాణలో రెయిన్ అలర్ట్

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాల తర్వాత రాష్ట్రానికి మరో అల్పపీడనం ప్రభావం చూపనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సంబంధించిన అల్పపీడనం రానున్న మూడు రోజులలో తెలుగు రాష్ట్రాలపై గణనీయ ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబాబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశముంది.

45
వాతావరణ శాఖ హెచ్చరిక
Image Credit : ANI

వాతావరణ శాఖ హెచ్చరిక

రాబోయే మూడు రోజుల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. అలాగే, భారీ వర్షాల సమయంలో చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర, పెద్ద హోర్డింగ్స్ కింద ఉండరాదని, పొంగిపొర్లే వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచననిచ్చారు.

55
వరద ప్రభావం తగ్గుముఖం
Image Credit : Getty

వరద ప్రభావం తగ్గుముఖం

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.2 అడుగులకు చేరినప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి ప్రమాద హెచ్చరికలు అమలులో లేవు. గోదావరి నది కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లు, పోలవరం వద్ద 12.65 మీటర్లుగా ఉంది. మరోవైపు, ధవళేశ్వరం డ్యామ్‌లో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి.

ఇక కృష్ణా నది వరద పరిస్థితిని పరిశీలిస్తే.. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులు ఉన్నాయి. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 3.92 లక్షల క్యూసెక్కుల వద్ద నిలిచాయి. అయితే, వరద పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image2
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved