MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update: రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 30 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉపరితల ఆవర్తనం, ఉత్తర దక్షిణ ద్రోణి ఎఫెక్ట్
Image Credit : Gemini

ఉపరితల ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ఎఫెక్ట్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.

నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా కొనసాగుతుండటంతో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్రప్రదేశ్, రాయలసీమ వాతావరణ అప్‌‌డేట్
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్, రాయలసీమ వాతావరణ అప్‌‌డేట్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

సీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

35
తెలంగాణలో ఏ ఏ జిల్లాలకు వర్ష సూచన వుందంటే?
Image Credit : Gemini

తెలంగాణలో ఏ ఏ జిల్లాలకు వర్ష సూచన వుందంటే?

ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ ప్రాంతాలపై ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ అందించిన తాజా వివరాల ప్రకారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే వీలుంది.

ఈ క్రమంలోనే పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశముంది.

45
హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతోంది?
Image Credit : Google AI

హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతోంది?

రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉండగా, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది.

ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయి. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో పాటు, రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

55
ప్రజలు, రైతులకు అలర్ట్
Image Credit : Gemini

ప్రజలు, రైతులకు అలర్ట్

వర్షాలు, ఉరుములు పడే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద, పాత భవనాల వద్ద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు.

వాహనదారులు జారే రోడ్లపై వేగాన్ని తగ్గించి ప్రయాణించాలి. ఇక పొలాల్లో పనులు చేసుకునే రైతులు ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఇప్పటికే కోసిన పంటలను నీరు చేరకుండా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Palle Panduga: గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.11,085 కోట్ల పనులకు శ్రీకారం
Recommended image2
Now Playing
ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu
Recommended image3
Now Playing
పల్లె పండుగ 3.0లో BJP చీఫ్ PVN మాధవ్ స్పీచ్ | Chandrababu | Pawan Kalyan | Asianet News Telugu
Related Stories
Recommended image1
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Recommended image2
India vs West Indies: ఇండియా vs వెస్టిండీస్ 2వ వన్డే.. సిరాజ్ రీఎంట్రీ, ప్లేయింగ్ 11లో భారీ మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved