రాముడి పేరుతో ఉన్న 300 రైల్వే స్టేషన్లకు ప్రత్యేక అలంకరణ.. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ..
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా రాముడి పేరుతో ఉన్న దాదాపు 300 రైల్వే స్టేషన్లు విద్యుత్ కాంతులతో మెరిసిపోనున్నాయి.
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 343 రైల్వే స్టేషన్ లని విద్యుత్ దీపాలతో అలంకరించనుంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రైల్వే శాఖ రాముడి పేరుతో ఈ ఏర్పాట్లు చేయనుంది.
వివిధ రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు ఇలా ముస్తాబు కానున్నాయి. ఇందులో ముందువరుసలో ఆంధ్ర ప్రదేశ్ 55 రైల్వేస్టేషన్లో మొదటిగా ఉండగా, రెండో స్థానంలో 54 రైల్వే స్టేషన్ లతో తమిళనాడు ఉంది. ఇక మూడో స్థానంలో బీహార్ ఉంది ఈ అన్ని రైల్వే స్టేషన్లు రాముడి పేరుతో ఉన్నవే.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ 343 రైల్వేస్టేషన్లో రాముడితో భారతీయులకు ఉన్న అనుబంధానికి సంకేతం గా నిలుస్తాయి. రైల్వే స్టేషన్లను ఇలా ముస్తాబు చేయడం రాముడితో ఉన్న ప్రజల అనుబంధాన్ని తెలుపుతుంది.
రామచంద్రపురం, రామగిరి లాంటి రైల్వే స్టేషన్లతో పాటు మిగతా రైల్వే స్టేషన్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చెందబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ స్టేషన్ లయిన రామచంద్రపురం, రామగిరి ,రామచౌరా రోడ్ ప్రత్యేకంగా ముస్తాబు అవ్వబోతున్నాయి.
అయోధ్యకు వెళ్లి భక్తుల కోసం ఆస్తా స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలంటే రౌండ్ ట్రిప్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ స్టాపుల్లో ఈ రైళ్లు ఆగుతాయి.