సోము వీర్రాజు 'మెగా' ప్లాన్: మాజీ జేడీ, ముద్రగడలతో కొత్త ఎత్తుగడ
సోము వీర్రాజు కాపు కులానికి చెందినవాడు. చిరంజీవి కుటుంబం కూడా అదే సామాజికవర్గం. సోము వీరిని కలవడం సహజంగానే కాపు కుల ఏకీకరణ లాగానే కనబడుతుంది. పరిస్థితులను చూస్తుంటే, కొన్ని అంతర్గత వర్గాల సమాచారం కూడా దాన్ని బలపరుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులైనప్పటి నుండి.... రాష్ట్రంలో ఏదో హడావుడి చేసి మీడియాలో కనిపించే పార్టీ.... ఇప్పుడు లైం లైట్ లో ఉంటూ టీవీ డిబేట్లలో కూడా ప్రధాన అజెండాగా వారి పార్టీ నిర్ణయాలు మారుతున్నాయి.

సోము వీర్రాజు నియమితులైనప్పటినుండి తనదైన శైలిలో తొలుత ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత సుజనా అనుంగ శిష్యుడు లంకా దినకర్ కి షో కాజ్ నోటీసు ఇచ్చాడు.

ఢిల్లీలో తన నిర్ణయాలన్నిటికీ.... ఆమోదముద్ర వేయించుకొని వచ్చినట్టు కనబడుతున్న సోము వీర్రాజు రాష్ట్రంలోని కొందరు సీనియర్ బీజేపీ నాయకులపై వేటు వేశారు వేస్తున్నారు. రమణ, గోపాలకృష్ణ వంటి వీరిని పార్టీ నుండి తొలగించారు. దీనితో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది.

ఆయన వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలిస్తే... ఆయన రాష్ట్రంలో తనదైన ముద్ర వేయాలని తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతుంది. ఆయన తాజాగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని కలిశారు.

మర్యాదపూర్వక భేటీగానే ఇది కనబడ్డప్పటికీ... అదే విషయాన్నీ వారు బయటకు చెప్పినప్పటికీ... ఆయన వ్యవహారశైలిని పరిశీలించినమీదట ఇది వాస్తవం కాదు అని అనిపించక మానదు. ఆయన ఏం చేసినా కారణం లేకుండా చేసేలా కనిపించడంలేదు.

మర్యాదపూర్వక భేటీగానే ఇది కనబడ్డప్పటికీ... అదే విషయాన్నీ వారు బయటకు చెప్పినప్పటికీ... ఆయన వ్యవహారశైలిని పరిశీలించినమీదట ఇది వాస్తవం కాదు అని అనిపించక మానదు. ఆయన ఏం చేసినా కారణం లేకుండా చేసేలా కనిపించడంలేదు.

సోము వీర్రాజు కాపు కులానికి చెందినవాడు. చిరంజీవి కుటుంబం కూడా అదే సామాజికవర్గం. సోము వీరిని కలవడం సహజంగానే కాపు కుల ఏకీకరణ లాగానే కనబడుతుంది. పరిస్థితులను చూస్తుంటే, కొన్ని అంతర్గత వర్గాల సమాచారం కూడా దాన్ని బలపరుస్తోంది.

సోము వీర్రాజు కాపు కులానికి చెందినవాడు. చిరంజీవి కుటుంబం కూడా అదే సామాజికవర్గం. సోము వీరిని కలవడం సహజంగానే కాపు కుల ఏకీకరణ లాగానే కనబడుతుంది. పరిస్థితులను చూస్తుంటే, కొన్ని అంతర్గత వర్గాల సమాచారం కూడా దాన్ని బలపరుస్తోంది.

రాష్ట్రంలో కాపులు 25 శాతం ఉన్నారు. ఎన్నో ఏండ్లుగా వారు అధికారం కోసం కలలు కంటున్నప్పటికీ... అది సాధ్యపడలేదు. అందని ద్రాక్షగా ఉన్న అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని అనుకుంటున్నా కాపులను గతంలో చిరంజీవి, మొన్న పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసినప్పటికీ... అదిసాధ్యపడలేదు.

దీనితో ఇప్పుడు సోము వీర్రాజు రంగంలోకి దిగారు. ఆయనకు తనకంటూ ప్రత్యేకమైన చరిష్మా లేకున్నప్పటికీ.... రాష్ట్రంలోని కాపు నాయకులందరినీ, ప్రముఖులందరిని ఒకతాటిపైకి తీసుకొచ్చే పనిని భుజానికెత్తుకున్నారు.

కాపు నాయకులనందరిని ఒకేతాటిపైకి తీసుకొస్తే... కాపుల ఓట్లన్నీ గంపగుత్తుగా తమ వెంట నడుస్తాయని, కాపు వోట్ బ్యాంకు అనేది పదిలంగా నమ్ముకోదగ్గ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన అనుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ఆయన ఇప్పుడు మరో ఇద్దరు నేతలను కలవబోతున్నారు. ఇటీవలే తాను ఇక కాపు ఉద్యమాన్ని మోయలేనని చెప్పి కాడెత్తేసిన ముద్రగడ పద్మనాభాన్ని త్వరలో సోము వీర్రాజు కలవబోతున్నారు. ఆయనను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ఆ తరువాత సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణను కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఆయన ప్రస్తుతానికి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో వాస్తవానికి లక్ష్మీనారాయణ గెలుస్తారని అందరూ భావించారు. గెలవకపోయినా గట్టి పోటీయే ఇచ్చారు. ఆయనను చేర్చుకోవడం ద్వారా గుడ్ విల్ ని పెంచుకోవాలనుకుంటున్నారు బీజేపీ నాయకులు.

ఇలా కాపులను ఒక్కతాటిపైకి తీసుకొస్తే.... బీజేపీ ఏపీలో కూడా బలపడొచ్చని వారు భావిస్తున్నారు. వైసీపీకి రెడ్ల పార్టీ అని ముద్ర ఉంది. టీడీపీకి కమ్మల పార్టీ అనే ముద్ర ఉంది. ఇప్పుడు కాపులను కలుపుకొని, నాన్ రెడ్డి, నాన్ కమ్మ పొలిటికల్ అవుట్ ఫిట్ గా బీజేపీని నిలబెట్టి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బలపడాలి అనేది బీజేపీ ఆలోచనగా కనబడుతుంది.