MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • Schools Bandh : తెలుగు స్టూడెంట్స్ కు ఊహించని హాలిడేస్.. ఈ వీకెండ్ వరుసగా మూడ్రోజులు సెలవులే

Schools Bandh : తెలుగు స్టూడెంట్స్ కు ఊహించని హాలిడేస్.. ఈ వీకెండ్ వరుసగా మూడ్రోజులు సెలవులే

జూలై 24న ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్ష విద్యార్థి సంఘాలు. దీనికి మరో రెండు సెలవులు కలిసివస్తున్నాయి. ఇలా ఈ వీకెండ్ వరుసగా మూడ్రోజులు సెలవుల రావడంతో లాంగ్ వీకెండ్ గా మారింది.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 22 2026, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏపీలో విద్యాసంస్థల బంద్
Image Credit : Getty

ఏపీలో విద్యాసంస్థల బంద్

Schools Bandh : వైద్య కళాశాలల్లో సీట్ల కోసం నిర్వహించే జాతీయస్థాయి ఎంట్రన్స్ టెస్ట్ NEET (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది. నీట్ పేపర్ లీక్ అవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాయి... ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయాలను సైతం కుదిపేస్తోంది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు, కాంగ్రెస్ శ్రేణుల నిరసనలతో దేశ రాజధాని డిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ఆందోళనలు పాకాయి.

ఇవాళ (జూలై 22, బుధవారం) కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థిసంఘాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వామపక్ష విద్యార్థిసంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నీట్ పేపర్ లీక్ తో పాటు ప్రస్తుతం నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్, కేంద్ర ప్రభుత్వ వ్యవహారతీరుకు నిరసనగా విద్యాసంస్థల బంద్ కు సిద్దమయ్యాయి. ఈ శుక్రవారం అంటే జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు బంద్ చేపట్టాలని విద్యార్థిసంఘాలు పిలుపునిచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ శుక్రవారం విద్యాసంస్థలు బంద్
Image Credit : Getty

ఈ శుక్రవారం విద్యాసంస్థలు బంద్

దేశంలోని లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని... ప్రతిష్ఠాత్మకమైన నీట్ ఎగ్జామ్ ను నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యిందని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ పేపర్ లీకేజీకి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్ లో ఇలాంటి క్వశ్చర్ పేపర్ లీకేజీ వ్యవహారాలు జరక్కుండా ఉండాలంటే ఇప్పుడే కఠినంగా వ్యవహరించాలని విద్యార్థి సంఘాలు నాయకులు సూచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకే ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. జూలై 24న ఏపీలోని స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు అన్ని విద్యాసంస్థల బంద్ పాటించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు బంద్ కు సహకరించి విజయంతం చేయాలని కోరారు.

NSUI, SFI, PDSU, AISA, DYFI, AIYF వంటి విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. మరికొన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ బంద్ కు సహకరిస్తామని ప్రకటించాయి. ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు కూడా ఈ విద్యాసంస్థల బంద్ కు సపోర్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి జూలై 24 (శుక్రవారం) విద్యాసంస్థలు పూర్తిగా మూతపడనున్నాయి.

Related Articles

Related image1
Rahul Gandhi: అట్టుడుకుతున్న ఢిల్లీ.. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్
Related image2
Rahul Gandhi Protest : మోదీ ఇంటిముందు రాహుల్, ప్రియాంక ధర్నా... ప్రధాని రాజీనామాకు డిమాండ్
34
జూలై 24, 25, 26 మూడ్రోజులు సెలవులేనా?
Image Credit : unsplash

జూలై 24, 25, 26 మూడ్రోజులు సెలవులేనా?

జూలై 24న విద్యాసంస్దల బంద్ తో కొందరు విద్యార్థులకు వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసిరానున్నాయి. శుక్రవారం బంద్ ఉండగా శని, ఆదివారం వీకెండ్ సెలవులు వస్తున్నాయి. అంటే వరుసగా మూడ్రోజులు సెలవులతో వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది.

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి పట్టణాల్లో కొన్ని కార్పోరేట్ స్కూళ్లు, కాలేజీలకు వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లలో చదివే విద్యార్థులకు జూలై 24 సెలవు కలిసిరానుంది. ఈ రోజు విద్యాసంస్థలు బంద్ అయితే శని, ఆదివారం కూడా సెలవు ఉంటుంది. ఇలా కొందరు విద్యార్థులకు వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి. మిగతా విద్యార్థులకు మాత్రం జూలై 25(శనివారం) యధావిధిగా తరగతులు నడుస్తాయి…. తిరిగి జూలై 26 ఆదివారం సెలవు ఉంటుంది.

44
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం
Image Credit : ANI

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం

దేశ రాజధాని డిల్లీలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన 'ఛల్లో పార్లమెంట్', ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీల ప్రధాని నివాసం ముట్టడి ఉద్రిక్తతలకు దారితీశాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కీలక కాంగ్రెస్ నాయకులను డిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఏఐసిసి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపును అందుకుని నేడు (జూలై 22న) తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. 'ఛలో లోక్ భవన్' కు పిలుపునిచ్చి హైదరాబాద్ లోని గవర్నర్ నివాసాన్ని ముట్టడిచింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సొంత నియోజకవర్గం కొండగల్ లో నిరసన చేపట్టారు. ఇదే సమయంలొ దేశ ప్రధాని ఇంటి ముట్టడిని ఖండిస్తూ తెలంగాణ బిజెపి కూడా నిరసన చేపట్టింది. ఇరుపార్టీల ఆందోళనలతో హైదరాబాద్ కూడా ఉద్రిక్తంగా మారింది.

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితులే నొలకొన్నాయి... కాంగ్రెస్, బిజెపి శ్రేణుల పోటాపోటీ ఆందోళనలు కొనసాగాయి. ఇలా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బిజెపి శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు... దీంతో పరిస్థితులు ఇరువర్గాలను చెదరగొట్టాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం
Recommended image3
Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?
Related Stories
Recommended image1
Rahul Gandhi: అట్టుడుకుతున్న ఢిల్లీ.. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్
Recommended image2
Rahul Gandhi Protest : మోదీ ఇంటిముందు రాహుల్, ప్రియాంక ధర్నా... ప్రధాని రాజీనామాకు డిమాండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved