రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరే యోచనలో ఉన్నారని ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతుంది. జనసేన తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, ఆయన తనయుడు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
పిల్లి సుభాష్ చంద్రబోస్ త్వరలోనే వైఎస్ఆర్‌సీపీ ద్వారా లభ్యమైన ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుండి పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్టు ఇచ్చేందుకు ఆ పార్టీ అంగీకరించిందని ప్రచారం సాగుతుంది.అయితే ఈ విషయమై పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి తన కొడుకు సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి చేసిన ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పోటీ చేస్తారని మిథున్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.ఈ ప్రకటనతో పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుకు వైఎస్ఆర్‌సీపీ టికెట్ ఇస్తే తాను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.అవసరమైతే పార్టీని కూడ వీడుతానని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించారు.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
వచ్చే ఎన్నికల్లో తన కొడుకును రామచంద్రాపురం నుండి బరిలోకి దింపేందుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగం సిద్దం చేసుకుంటున్నారు.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
ఈ నెల 16వ తేదీన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి పిల్లి సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని తీర్మానం చేశారు. ఈ సమావేశానికి కౌంటర్ గా మంత్రి చెల్లుబోయిన వేణు వర్గీయులు ఈ నెల 23న సమావేశం నిర్వహించారు. అయితే మంత్రిగా వేణు బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సమావేశాన్ని నిర్వహించినట్టుగా మంత్రి వేణు వర్గీయులు చెబుతున్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గానికి కౌంటర్ గా ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని ప్రకటించారు.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలను వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం కూడ సీరియస్ గా తీసుకుంది.ఈ నెల 18న సీఎం జగన్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తాడేపల్లికి పిలిపించారు. సీఎంకు మంత్రి వేణుపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ పై సీఎం జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారని ప్రచారం కూడ సాగింది. పిల్లి సూర్యప్రకాష్ ను ఏ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలో తనకు వదిలివేయాలని సీఎం జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు చెప్పారంటున్నారు.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
ఇదిలా ఉంటే రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిణామాలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో నిన్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిణామాలపై చర్చించారు. అయితే మంత్రి వేణుపైనే తోట త్రిమూర్తులు కూడ మిథున్ రెడ్డికి ఫిర్యాదు చేశారని సమాచారం.
రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీని వీడి తోట త్రిమూర్తులు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. తోట త్రిమూర్తులు గతంలో రామచంద్రాపురం నుండి పలు దఫాలు టీడీపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా విజయం సాధించారు. రామచంద్రాపురం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణును బరిలోకి దింపింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. శాసనమండలిని రద్దు చేయాలనే యోచనలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మంత్రివర్గం నుండి తప్పించి రాజ్యసభకు పంపారు.
pilli subash chandrabose
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకున్నపరిణామాలపై అసంతృప్తిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతుంది.