MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • Roja: రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఆ రెండు సంపాదించుకున్నా.. అరెస్ట్ వార్త‌ల వేళ రోజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Roja: రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఆ రెండు సంపాదించుకున్నా.. అరెస్ట్ వార్త‌ల వేళ రోజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా పేరు చర్చకు వచ్చింది. ఒకవైపు ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు, మరోవైపు “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంపై విజిలెన్స్ రిపోర్టు బయటకు రావడం వల్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 08 2026, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజకీయ జీవితం… ఆరోగ్యంపై ప్రభావం
Image Credit : Asianet News

రాజకీయ జీవితం… ఆరోగ్యంపై ప్రభావం

నగరిలో తన నివాసంలో పదవీకాలం పూర్తి చేసిన వైసీపీ సర్పంచ్‌లను సత్కరించిన సందర్భంగా రోజా మాట్లాడారు. రాజకీయాల్లో పనిచేయడం అంత సులభం కాదని, అది మానసిక ఒత్తిడితో నిండిన ప్రయాణమని చెప్పారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బీపీ వచ్చిందని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత షుగర్ వచ్చినట్టు తెలిపారు. రాజకీయాల్లో ఉండే ఒత్తిడి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైసీపీ పాలనపై రోజా వ్యాఖ్యలు
Image Credit : facebook.com/rojaselvamanirk

వైసీపీ పాలనపై రోజా వ్యాఖ్యలు

గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రోజా పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించడం తమ పార్టీ విధానం అని చెప్పారు. గ్రామస్థాయిలో పనిచేసిన సర్పంచ్‌లు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించారని ఆమె అభినందించారు. స్థానిక నాయకులు ప్రజల్లో గౌరవంగా తిరిగేలా పనిచేశారని పేర్కొన్నారు.

35
ఎన్నికల ఫలితాలపై స్పందన
Image Credit : Roja Selvamani/Instagram

ఎన్నికల ఫలితాలపై స్పందన

గత ఎన్నికల్లో ఓటమిపై కూడా రోజా మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి నాయకుల మాదిరిగా తాము తప్పుడు హామీలు ఇవ్వలేకపోయామని చెప్పారు. నిజాయితీతో ప్రచారం చేసినప్పటికీ ఫలితం ఆశించినట్లు రాలేదని వ్యాఖ్యానించారు. అయితే భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మళ్లీ బలంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించి గెలిచినవారికి భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.

45
“ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంపై విజిలెన్స్ రిపోర్ట్
Image Credit : Google

“ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంపై విజిలెన్స్ రిపోర్ట్

ఇదిలా ఉండగా, వైసీపీ ప్రభుత్వ కాలంలో నిర్వహించిన “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంపై విజిలెన్స్ విభాగం విచారణ పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో జరిగిన ఖర్చులు, నిర్వహణ విధానం వంటి అంశాలపై సుదీర్ఘంగా పరిశీలన జరిపిన అధికారులు తమ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించారు. విచారణలో అప్పటి క్రీడాశాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నాయని విజిలెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది.

55
భారీ ఖర్చులు, విచారణలో వెలుగుచూసిన అంశాలు
Image Credit : Google

భారీ ఖర్చులు, విచారణలో వెలుగుచూసిన అంశాలు

“ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమం మొదట రూ.40 కోట్ల అంచనాతో ప్రారంభమైనప్పటికీ, చివరకు ఖర్చు రూ.100 కోట్లకు పైగా పెరిగిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జరిగిన విచారణలో కూడా నిధుల వినియోగంపై అనేక అనుమానాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. గ్రామస్థాయిలో క్రీడల నిర్వహణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు చూపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. పోటీల నిర్వహణ, పరికరాల కొనుగోలు, ఆటగాళ్లకు ఇచ్చిన సదుపాయాల విషయంలో కూడా అక్రమాలు జరిగాయని రిపోర్ట్ లో ప్రస్తావించినట్టు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ విచారణ ప్రారంభమైంది. సుమారు 600 ప్రాంతాల్లో పరిశీలన చేసి, వందలాది మందిని విచారించిన విజిలెన్స్ అధికారులు 30 వేల పేజీలకు పైగా ఉన్న రిపోర్ట్ ను సమర్పించారు. మొత్తం రూ.40 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ లేదా సీఐడీ ద్వారా మరింత లోతైన విచారణకు ఆదేశించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
Recommended image2
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image3
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Related Stories
Recommended image1
అంతా అయిపోంద‌నిపిస్తోందా.? ఈ ఒక్క పాట వింటే మీ జీవితం కొత్త‌గా మొద‌ల‌వ‌డం ఖాయం
Recommended image2
Business Ideas: ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియాతో డ‌బ్బే డ‌బ్బు.. మొబైల్ రిపేర్‌లో స‌రికొత్త ట్రెండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved