- Home
- Andhra Pradesh
- భీమవరం డీఎస్పీ వ్యవహారం.. పవన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
భీమవరం డీఎస్పీ వ్యవహారం.. పవన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Raghurama Krishna Raju: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు భీమవరం డీఎస్పీ ఎపిసోడ్‌పై మరోసారి స్పందించారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయంలో తనకొచ్చిన సమాచారం తప్పై ఉండవచ్చని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ చేసిన ఫిర్యాదులు సరైనవని తెలిపారు.

డీఎస్పీ ఎపిసోడ్‌పై స్పందన
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు భీమవరం డీఎస్పీ ఎపిసోడ్‌పై మరోసారి స్పందించారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను పవన్ కల్యాణ్ అభిమానినని పేర్కొంటూ, డీఎస్పీ అంశంపై పవన్ అభిమానులు తనను అపార్థం చేసుకుంటున్నారని వాపోయారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై తనకు అందిన సమాచారం తప్పై ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్‌కు వచ్చిన ఫిర్యాదులు సరైనవి..
పవన్ కల్యాణ్‌కు వచ్చిన ఫిర్యాదులు సరైనవి కావచ్చని, వాటిపై డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించడం సరైనదని తెలిపారు. ఆ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రఘురామకృష్ణ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, దానిపై విచారణ జరపమని చెప్పడం ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యత గల డిప్యూటీ సీఎంగా నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ చర్య సరైనది అని ఆయన అన్నారు.
రఘురామకృష్ణ రాజు వివరణ
తన ప్రాంతంలో పనిచేస్తున్న వ్యక్తి గురించి తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పడం తన బాధ్యత అని రఘురామకృష్ణ రాజు వివరించారు. తాను చెప్పిన విషయం లేదా పవన్ కల్యాణ్‌కు అందిన సమాచారం సరైనది కావచ్చు లేదా తప్పు కావచ్చునని, విచారణలో నిజం తెలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ
ఇంతలోనే డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అంటూ పలు థంబ్‌నెయిల్స్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. దీనిపై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. తనను అపార్ధం చేసుకున్నారని, తాను పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నానని.. కేవలం తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే పంచుకున్నానని ఆయన అన్నారు.
ఇప్పుడిదే హాట్ టాపిక్
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ భీమవరం డీఎస్పీ వ్యవహారం పెద్ద టాపిక్ గా మారింది. భీమవరం డీఎస్పీ వ్యవహారశైలి సరిగ్గా లేదని, ఆయన పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని పలు ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వచ్చిన సంగతి తెలిసిందే.

