MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Andhra: రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్.? ప్రజల నుంచి నాలుగు ప్రతిపాదనలు.. మరి ప్రభుత్వం నిర్ణయమేంటి.?

Andhra: రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్.? ప్రజల నుంచి నాలుగు ప్రతిపాదనలు.. మరి ప్రభుత్వం నిర్ణయమేంటి.?

Andhra: వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సుమారు రూ. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలి.? అని ప్రజలను సూచనలు అడిగింది. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం..

2 Min read
Author : Pavithra D
Published : Oct 20 2025, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైఎస్ జగన్ సమయంలో నిర్మాణం..
Image Credit : AP Govt Twitter

వైఎస్ జగన్ సమయంలో నిర్మాణం..

ఏపీలోని కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో నిరుపయోగంగా పడి ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను ఉపయోగించేందుకు ఆచరణీయమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలో వస్తే.. ఇక్కడ నుంచి పాలన చేపట్టాలని దీన్ని నిర్మించారు. అయితే అది జరగలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
15 నెలల నుంచి నిరుపయోగం..
Image Credit : AP Govt Twitter

15 నెలల నుంచి నిరుపయోగం..

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఈ రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలని సమాలోచనలు చేసింది. అందుకోసం ప్రజలను కూడా సాయం కోరింది. వారి నుంచి వచ్చే ప్రతిపాదనలను తీసుకోవాలనుకుంది. గత వారం ఈ మేరకు ప్రజల నుంచి సూచనలు అడిగింది ఏపీ పర్యాటక శాఖ.

Related Articles

Related image1
Andhra: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే.?
Related image2
Andhra Pradesh: ఏపిలో ల్యాండ్ అయిన ప్ర‌ధాని.. మోదీ రాక‌తో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
35
స్టార్ హోటళ్ల సమాఖ్య సరికొత్త ఆలోచన..
Image Credit : X Account CM Naidu

స్టార్ హోటళ్ల సమాఖ్య సరికొత్త ఆలోచన..

ప్రభుత్వ పిలుపు మీరకు ఆంధ్రప్రదేశ్‌లోని స్టార్ హోటళ్ల సమాఖ్య ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. పర్యాటక కార్యదర్శి అమ్రపాలికి తమ ఆలోచన చెప్పింది. ఈ ఖరీదైన ప్యాలెస్‌ను ఉపయోగించుకునేందుకు సమాఖ్య నాలుగు ప్రతిపాదనలను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ భారం కాకుండా ప్రయోజనం చేకూరుస్తుందని సమాచారం.

45
ప్రతిపాదనలు ఇలా..
Image Credit : our own

ప్రతిపాదనలు ఇలా..

మొదటి సూచన.. యూఎస్ఏ, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలకు ఈ ప్యాలెస్‌ను కాన్సులేట్ కార్యాలయంగా ఇవ్వండని పేర్కొంది. విభజన తర్వాత రాష్ట్రంలో కాన్సులేట్ కార్యాలయం లేకపోవడం వల్ల వైజాగ్‌లోని రుషికొండ ప్యాలెస్‌ను విదేశీ రాయబార కార్యాలయంగా ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ చర్య. కాబట్టి ఇది సముచితమైన నిర్ణయం అని అంటున్నారు విశ్లేషకులు.

55
పీపీపీ మోడల్‌లో..
Image Credit : AP Govt Twitter

పీపీపీ మోడల్‌లో..

జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ బ్రాండ్‌లతో పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంఅయ్యి.. ఈ ప్యాలెస్‌ను దీర్ఘకాలిక ప్రాతిపదికన లీజుకు ఇస్తే.. రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. అలాగే మూడో ప్రతిపాదన.. ఈ భవనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం.. పరిసరాల్లో రిసార్ట్‌లు, బాంకెట్ హాళ్లు, వివాహ వేదికలు, వాటర్ స్పోర్ట్స్ లాంటివి నిర్మిస్తే.. వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. చివరిగా ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి.. గిరిజన, చేతిపనుల ఉత్పత్తులను ప్రదర్శించి.. బీచ్ ఫెస్టివల్స్, సంగీత కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్యాలెస్‌ను సాంస్కృతిక గమ్యస్థానంగా మార్చవచ్చునని అన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో చూడాలి.?

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Andhra: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే.?
Recommended image2
Andhra Pradesh: ఏపిలో ల్యాండ్ అయిన ప్ర‌ధాని.. మోదీ రాక‌తో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved