- Home
- Andhra Pradesh
- Holidays: విద్యార్థులకు సడన్ సర్‌ప్రైజ్.. ఏపీలో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు.!
Holidays: విద్యార్థులకు సడన్ సర్‌ప్రైజ్.. ఏపీలో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు.!
Holidays: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు

రాయలసమీ అభివృద్ధి లక్ష్యంగా..
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్శనలో భాగంగా సుమారు రూ.13,430 కోట్ల విలువైన 16 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ఓర్వకల్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పార్కు, రహదారి, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించే రూ.2,880 కోట్ల ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ, అలాగే ఓర్వకల్-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో రూ.4,920 కోట్ల పనులు ప్రారంభించనున్నారు. ఈ రెండు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని NICDIT, APIIC సంస్థలు సంయుక్తంగా చేపడతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగవకాశాలు రానున్నయని ప్రభుత్వం చెబుతోంది. ఇది రాయలసీమ ప్రాంత పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
రహదారులు, వంతెనలు, పైప్‌లైన్లకు శ్రీకారం
ప్రధాని మోదీ రూ.960 కోట్లతో సబ్బవరం–షీలానగర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి, రూ.1140 కోట్లతో పీలేరు–కాలూరు నాలుగు లేన్ రహదారి విస్తరణ, అలాగే గుడివాడ–నుజెళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా, రూ.1200 కోట్లతో కొత్తవలస–విజయనగరం నాలుగో లేన్, పెందుర్తి–సింహాచలం రైల్ ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభించనున్నారు. గెయిల్ గ్యాస్ పైప్‌లైన్, కొత్తవలస–బొద్దవారతో పాటు శిమిలిగుడ–గోరాపూర్ సెక్షన్లను జాతికి అంకితం చేస్తారు.
కర్నూలులో జీఎస్టీ-2.0 ప్రజాసభ
ప్రధాని మోదీ కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద నిర్వహించనున్న “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ-2.0పై అవగాహన కల్పించే తొలి సభ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు హాజరుకానున్నారు.
శ్రీశైల దర్శనం
బహిరంగ సభకు ముందు ప్రధాని మోదీ శ్రీశైల జ్యోతిర్లింగం, భ్రమరాంబికా శక్తి పీఠాన్ని దర్శించుకుంటారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్‌కు ఆ తర్వాత హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళతారు. అక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పురావస్తు శాఖ ప్రదర్శనలో ఉన్న పురాతన తామ్ర శాసనాలు, రాగి రేకులు వీక్షిస్తారు.
ప్రధాని పర్యటన కారణంగా పాఠశాలలకు సెలవులు
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కర్నూలు రూరల్, అర్బన్, కల్లూరు, ఓర్వకల్ మండలాల్లోని విద్యాసంస్థలు రెండు రోజులు మూసివేస్తారు. ఈ రోజుల్లో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 21, 22 తేదీలకు వాయిదా వేశారు.
భద్రతా చర్యలు కట్టుదిట్టం
ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో నల్లమల అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. ఒక్క శ్రీశైలంలోనే 1,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల వల్ల గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా..
* ఉదయం 7:50 – ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.
* ఉదయం 10:20 – ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
* ఉదయం 11:10 – హెలికాప్టర్‌లో సున్నిపెంటకు ప్రయాణం
* ఉదయం 11:45 – శ్రీశైల దేవాలయ దర్శనం
* మధ్యాహ్నం 1:40 – సున్నిపెంట నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కి.
* మధ్యాహ్నం 2:30 – కర్నూలు రాగమయూరి సభా ప్రాంగణంలో ప్రజా సభలో పాల్గొని ప్రసంగం