MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఇది ప్రజాపాలన.. పరదాలు ఉండవు.. టీటీడీని ప్రక్షాళన చేస్తాం.. తిరుమ‌ల‌లో చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇది ప్రజాపాలన.. పరదాలు ఉండవు.. టీటీడీని ప్రక్షాళన చేస్తాం.. తిరుమ‌ల‌లో చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Chandrababu Naidu: తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న ప్రారంభ‌మైంద‌నీ, గ‌త పాల‌కులు వెంకన్న సన్నిధిని అప‌విత్రం చేశార‌నీ, టీటీడీని ప్రక్షాళన చేసి తిరుమల పవిత్రను కాపాడతామ‌ని అన్నారు.  

4 Min read
Mahesh Rajamoni
Published : Jun 13 2024, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chandrababu Naidu, Telugu Desam Party, TDP

Chandrababu Naidu, Telugu Desam Party, TDP

Chandrababu Naidu: రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామనీ, తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకుల హయాంలో తిరుమల కొండపైకి గంజాయితో పాటు నాన్ వెజ్, మద్యం తీసుకొచ్చి పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

27
Chandrababu Naidu, Telugu Desam Party, TDP

Chandrababu Naidu, Telugu Desam Party, TDP

కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుచానారు అమ్మవారిని కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకముందు కొండపైన మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ‘‘మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. 93 శాతం స్ట్రైక్ రేట్ ఎప్పుడూ దేశ, రాష్ట్ర చరిత్రలో రాలేదు. నేను ఏ సంకల్పం తీసుకన్నా వెంకటేశ్వరస్వామిని తలచుకుని ముందకు వెళ్తా. చిన్నతనంలో కూడా దేవుడికి మొక్కలు తీర్చుకోవడానికి నడిచివచ్చేవాళ్లం. ఆయన ఆశీస్సులతో అంచలంచలుగా నేను ఎదగి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాను. 2003లో వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుంటే క్లేమోర్ మైన్స్ పేలాయి...అప్పుడు ఆ ఏడుకొండలవారే నన్ను బతికించారు. ఆయన సేవకు వచ్చి చనిపోతే అపవాదు వస్తుందనో, నా వల్ల ఈ రాష్ట్రానికి..తెలుగుజాతికి ఇంకా మంచి చేయాలన్న ఆశీస్సులతోనో ప్రాణభిక్ష పెట్టారు. తిరుపతిలో అన్నదాన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. నా మనవడు దేవాన్ష్ ప్రతి పుట్టినరోజు నాడు అన్నదానానికి విరాళం అందిస్తున్నా. నేను ఎక్కువగా పూజలు చేయకపోయినా పవిత్రమైన మనసుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడ్ని ఒకటే కోరుకుంటా.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

37
Chandrababu Naidu, Telugu Desam Party, TDP

Chandrababu Naidu, Telugu Desam Party, TDP

తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి

ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగుజాతి అగ్రస్థానం ఉండాలి. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో..సృష్టించిన సంపద పేదవారికి అందడం అంతే ముఖ్యం. సంపద కొంతమందికే పరిమితం కాకుండా పేదరికం లేని సమాజంగా మారాలి. పేదరికం లేని రాష్ట్రం, జిల్లాగా మారినప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలతో ప్రజలు ముందుకెళ్తారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించాలి..ఇది ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలతో సాధ్యం అవుతుంది. 1995లో సీబీఎన్ పాలన ప్రారంభమైంది. అంతక ముందు సచివాలయానికే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యన జరిగింది. ఆరోజు చేసిన అభివృద్ధితో వచ్చిన ఫలాలు చూసి ప్రపంచాధినేతలంతా హైదరాబాద్ రావడానికి ప్రయత్నించారు. జరిగిన మంచిని ప్రపంచమంతా గుర్తిచ్చింది...ఆ గుర్తింపునే మేము తీసుకొచ్చాం. దేశానికి అతిపెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో ఎనర్జీ రీఛార్జ్ తో పాటు, భద్రత, ఆనందం, బాధలను పంచుకునే భాగస్వాములుగా ఉంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు అండగా కుటుంబం నిలబడింది. జైల్లో కలవడానికి కుటుంబ సభ్యులకు వారానికి రెండు సార్లు మాత్రమే కలవనిచ్చారు. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు...మా ఇంటి ఇలవేల్పు దైవం. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక్కపొద్దుతో నిష్టగా పూజలు చేసిన తర్వాతే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్లం...ఈ సంస్కృతి చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉండేది. కలియుగం దైవం వెంకటేశ్వరస్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ రావాలని కోరుకుంటారు. ప్రపంచంలో మనదేశం ముందుండాలి...అందులో తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

47
Chandrababu Naidu, Telugu Desam Party, TDP

Chandrababu Naidu, Telugu Desam Party, TDP

పేదరికం లేని సమాజాన్ని స్థాపించేందుకు శక్తినివ్వాలని కోరుకున్నా

‘‘పేదరికం లేని సమాజాన్ని స్థాపించేందుకు నాకు శక్తిసామర్థ్యాన్ని ఇవ్వాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నా. సంపద లేనప్పుడు...సృష్టించడం కోసం రెండవ తరం ఆర్థిక సంస్కరణలు నేను తీసుకొచ్చాను. సంస్కరణలతో బ్రహ్మండమైన రోడ్లు వచ్చాయి. దేశంలో మొదటి నేషనల్ హైవే నెల్లూరు-చెన్నైకు ఏర్పాటైంది.  అది విజయవంతమవడంతో నాటి ప్రధాని వాజ్ పేయ్ దేశమంతా అమలు చేశారు..ఈ విధానం జిల్లాలకు కూడా విస్తరించింది. ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు...కానీ ఇప్పుడు నిత్యవసర వస్తువైంది...ఆయుధమైంది. వర్చువల్ వర్క్ కు కూడా పనికొస్తోంది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

57
chandrababu naidu

chandrababu naidu

నేను ఒక్కరి వాడిని కాదు...అందరి వాడిని 

‘‘పరదాలు కట్టడం అధికారులకు అలవాటైంది. జనాలు కలవకుండా కర్ఫ్యూ పెట్టారు..ఇలాంటి సంస్కృతి చూస్తే బాధేస్తోంది. పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు...కానీ తప్పు చేసిన వారికి శిక్ష వేయకపోతే దేవుడు కూడా సహకరించరు. మంచివారిని కాపాడుకోవాలి...చెడు వ్యక్తులను శిక్షించి సమాజాన్ని కాపాడాలి. నా జీవితంలో నా కుటుంబానికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 35 ఏళ్ల క్రితమే చిన్న వ్యాపారం స్థాపించి పెట్టి నా కుటుంబం రాజకీయాలపై ఆధారపడకుండా చేశాను. నా జీవితంలో కుటుంబానికి ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కుటుంబానికి సమయం ఇస్తా. ఆదరించిన ప్రజలకు రుణపడి ఉంటా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలను  భయపెట్టారు. నాకు ప్రజలపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ప్రజలు గెలవాలి...రాష్ట్రం నిలవాలి...తెలుగువారు ఎక్కడున్నా తమ బాధ్యత నిర్వర్తించాలని కోరుతున్నా. ప్రజలు గెలిచారు...రాష్ట్రాన్ని నిలబెట్టారు...ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు...అందరి వాడిని. ఐదుకోట్ల ప్రజలకు చెందిన వ్యక్తిని.’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

67

ఐదేళ్ల విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి

కొందరు మీడియా ప్రతినిధులు కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడి కోర్టుల చుట్టూ తిరిగారు. వాస్తవాలు చెప్పలేని దుస్థితి అనుభవించారు. నాయకులు, కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. శనివారం వస్తే ఎప్పుడు ఎవరి ఇంటిపైకి ప్రొక్లెయిన్ వస్తుందో...41ఏ నోటీసులిస్తారో భయపడే పరిస్థితి కల్పించారు. కానీ ఇప్పుడు చెట్లు నరకడం, పరదాలు కట్టడం, ప్రొక్లెయిన్ పంపడాలు ఉండవు. రాష్ట్రంలో ఇక ప్రజా పాలన ప్రారంభమైంది. ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని నాపై నమ్మకం పెట్టుకున్నారు...ఆ నమ్మకాన్ని నేను నిరూపించుకోవాలి. ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. తిరిగి పునర్నిర్మించుకోవాలి. పాలనలో రాగద్వేషాలకు తావు లేదు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభుత్వంలో భాగం కావాలి. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్-1 గా ఉంటుంది. ఏ దేశానికి వెళ్లినా భారతీయులు ఖచ్చితంగా ఉంటారు...అందులో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. టెక్నాలజీ, ఐటీని అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చాం. రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల సేవలు ప్రపంచానికి అవసరం ఉంటుంది. 2047 నాటికి నాటికి తెలుగుజాతి నెంబర్-1గా ఉంటుంది.’’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

77

తెలుగు జాతికి పెద్దగా ఉంటా...

‘‘రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాల్సి ఉంది. ఆంధ్రపదేశ్ తో పాటు తెలంగాణ కూడా బాగుండాలి. తెలుగుజాతికి నేను పెద్దగా ఉంటా. విభజన జరిగినప్పుడు హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది. కష్టపడి  ఏపీకి మంచి నగరం నిర్మించి అభివృద్ధి చేసి రుణం తీర్చుకోవాలనుకున్నా. అందుకే అమరావతి, పోలవరం ప్రారంభిస్తే అవి రెండూ గత ప్రభుత్వంలో పడకేశాయి, అమరావతి విధ్వంసం పాలైంది...ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే జీవనాడి పోలవార్ని గోదావరిలో కలిపారు, ప్రజలు, ఎన్డీయే కార్యకర్తల ఆరోగ్యంతో బాగుండాలి...నేను అనుకున్న సంకల్పం ముందుకు వెళ్లేలా దేవుడు ఆశీర్వదించాలి. తిరుమల పవిత్రమైన దివ్యక్షేత్రం...ఈ దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. ప్రసాదాల నాణ్యత లేకుండా, శుభ్రం లేకుండా తిలోదకాలు తెచ్చారు. ఓం నమో వెంకటేశాయా...గోవింద నామస్మరణ తప్ప మరో మరో నినాదం కొండపై ఉండకూడదు. మొత్తం ప్రక్షాళన చేసి ప్రపంచమంతా అభినందించేలా టీటీడీని తీర్చిదిద్దుతాం. దొంగలే దొంగ దొంగ అంటూ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు...అలాంటి వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సంఘవిద్రోహ శక్తులు, రౌడీలు లేకుండా చేశాను. రాజకీయ ముసుగులో నేరస్తులు ఉండకూడదు. నేరాలు చేసినా తప్పించుకోలేరు.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
జనసేన
పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ
తిరుపతి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved