MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఇంటి ఆవరణనే అడవిగా మార్చేసిన పవన్ కళ్యాణ్

ఇంటి ఆవరణనే అడవిగా మార్చేసిన పవన్ కళ్యాణ్

‘‘ప్రకృతితో కలసి బతకాలన్నది విశ్వమానవ సిద్ధాంతం. అలాంటి ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రకాలుగా వినాశనం చేస్తూ మనిషి తన రోజువారీ జీవితం గడుపుతున్నాడు. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి.’’

4 Min read
Galam Venkata Rao
Published : Jul 30 2024, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

పర్యావరణ- అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని.. తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ- అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ టైగర్ డే పోస్టర్ విడుదల చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన) ఏర్పాటు చేసిన టైగర్స్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హాబీ కలిగిన బేబీ నాయన, ఆయన మిత్రులు దేశంలోని జాతీయ పార్కులు, టైగర్ సఫారీల్లో తీసిన పులుల ఫోటోలను అక్కడ ప్రదర్శించారు. 

27
మన సంస్కృతిలో భాగం

మన సంస్కృతిలో భాగం

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య, అభయారణ్యంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ప్రాణి వసుదైక కుటుంబంలోకే వస్తుందన్నారు. అడవులు మన సంస్కృతిలో భాగమని... అక్కడుండే ప్రాణులు కూడా మనకు ఎంతో అవసరమని చెప్పారు. వాటి సంరక్షణ బాధ్యతలు మనమే తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 సమయంలో వసుదైక కుటుంబం గురించి చెబుతూ ప్రకృతిలో భాగమైన చెట్లు, జంతుజాలం, క్రిమికీటకాలు.. అన్నీ వసుదైక కుటుంబంలో భాగమేనన్నారని గుర్తుచేశారు. 

37
ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి

ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి

అటవీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. అధికారులు సైతం ఇదే లక్ష్యంతో పని చేయాలని.... ఈ విషయంలో తన నుంచి పూర్తి సహకారం లభిస్తుందని స్పష్టం చేశారు. ‘‘ప్రకృతితో కలసి బతకాలన్నది విశ్వమానవ సిద్ధాంతం. అలాంటి ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రకాలుగా వినాశనం చేస్తూ మనిషి తన రోజువారీ జీవితం గడుపుతున్నాడు. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. అడవుల విధ్వంసం అనేది ఆగాలి. అరణ్యాల్లో బతికే వన్యప్రాణులు, వాటి రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అక్రమంగా పులుల్ని వేటాడే వారిపైనా, స్మగ్లింగ్ కి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 

47
భయంతోనే హాని తలపెడతారు

భయంతోనే హాని తలపెడతారు

‘‘ఇక్కడ ఒక విషయం చెప్పాలి... నా చిన్నతనంలో ఒంగోలులో ఉన్నప్పుడు మా వీధిలోకి ఒక పంగోలిన్‌ను అందరూ కలిసి కొట్టేశారు. అది ప్రమాదకరమా అని అడిగితే మాకూ తెలియదు. ఏమైనా చేస్తుందేమోనని భయంతో కొట్టేశామన్నారు. వన్యప్రాణులపై ముందుగా భయంతోనే హాని తలపెడతారు. వన్య ప్రాణి పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వసుధైక కుటుంబం అంటే మనుషులతోపాటు పశుపక్షాదులు, చెట్లు, జంతువులు కూడా ఉండాలి. నేను రాజకీయ నాయకుడి కంటే ముందు ప్రకృతి సంరక్షకుడిని. నా ఫాం హౌస్ లో నేను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పెరిగే మొక్కలు, చెట్లు, కీటకాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాను. దీనివల్ల అనేక పక్షులు అక్కడికి వచ్చి చేరాయి. దీని కోసం మనం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. ఉన్నంతలో సంరక్షణ చర్యలు చేపడితే చాలు. హైదరాబాద్ లో నేను ఉండే 1400 చదరపు గజాల ఇంటి ఆవరణలోనూ సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే చిన్నపాటి అడవిలా తయారైంది. ఇప్పుడు అక్కడ అరుదైన పక్షులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి.’’ పవన్ కళ్యాణ్ తెలిపారు. 

57
వారి మాటలు కదిలించాయి: పవన్ కళ్యాణ్

వారి మాటలు కదిలించాయి: పవన్ కళ్యాణ్

‘‘ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో పులుల సంరక్షణ గురించి చెబుతూ నల్లమల అడవుల్లో చెంచులు టైగర్ ట్రాకర్స్‌గా ఉన్నారని, అక్కడ వన్యప్రాణుల సమాచారం అందించడంతో పాటూ అక్రమాలు జరగకుండా నిఘా ఉంచుతారని తెలిసి ఆనందం కలిగించింది. పులులు వారి సంస్కృతిలో అంతర్భాగం అని చెప్పిన మాటలు స్ఫూర్తి కలిగించాయి. కొన్ని సంవత్సరాల కిందట నల్లమల ప్రాంతానికి చెందిన చెంచు జాతికి చెందిన 16 ఏళ్ల శివ అనే కుర్రాడు హైదరాబాద్‌లో మా ఆఫీస్ దగ్గరకి వచ్చాడు. అతనితో మాట్లాడినప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద చెంచులకి ఉన్న నిబద్దత తెలిసింది. అతను నా దగ్గరకు వచ్చిన పని నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే మా అడవులు పోతాయి. పులులు చచ్చిపోతాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. నల్లమల విధ్వంసానికి గురవుతుంది. నా మాట ఎవరు వింటారో తెలియక మీ దగ్గరకు వచ్చాను. ఏమైనా చేయమని అడిగాడు. ఆ క్రమంలో కాంగ్రెన్ నాయకులు శ్రీ వి. హనుమంతరావు గారికి చెప్పి నల్లమలలో యురేనియం అన్వేషణపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సమావేశంలో చిగుళ్ల మల్లికార్జున్ అనే చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాటలు నన్ను కదిలించాయి. ‘నల్లమలలో ఉన్న చెట్లు, జంతువులు, వాగులు అన్నింటినీ మేము దేవతలుగా కొలుస్తాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవర, ఎలుగుబంటిని లింగమయ్యగా చూస్తాం. అడవి పందిని గూబల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని పిలుచుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మగా కొలుస్తాము. తేనెలో ఉండే తెల్లగడ్డను మల్లమ్మ అంటాం’ అని అక్కడ తమ ఆచార వ్యవహారాలను, జీవితాన్ని వివరించారు’’ అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.

67
పనిచేసిన అధికారులకు గుర్తింపు

పనిచేసిన అధికారులకు గుర్తింపు

‘‘శ్రీ బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం చదివినప్పుడు ప్రకృతి ప్రాముఖ్యత అర్థమైంది. ఇప్పుడు నేను దేవుని దయతో ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అంతర్జాతీయ పులుల దినోత్సవాన అధికారులకు మాటిస్తున్నాను. ఇక్కడ ఎంతో నిబద్దత కలిగిన అధికారులు ఉన్నారు. అద్భుతంగా పని చేసిన కొంత మంది అధికారులకు గుర్తింపు రాలేదన్న విషయం నాకు తెలిసింది. గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేసిన పని పది మందికి తెలిస్తే అది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. అధికారులు అటవీ పరరిక్షణ కోసం కలలు కనండి. ప్రణాళికలు సిద్ధం చేయండి. వాటిని అమలుపరిచే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజలకు చేరువయ్యేలా పని చేద్దాం. అవసరం అయితే అధికారులు చెప్పిన విధంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో జూ పార్కులు అభివృద్ధి చేద్దాం. అటవీశాఖ మంత్రిగా, పర్యావరణ ప్రేమికుడిగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అటవీ శాఖకు బడ్జెట్ పెంచే విధంగా, ఉద్యోగుల కొరత భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

77
శ్రీశైలం- శేషాచలం అటవీ కారిడార్

శ్రీశైలం- శేషాచలం అటవీ కారిడార్

‘‘పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటాం. నల్లమల, శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవులను పెంచేందుకు కృషి చేస్తాం. టైగర్ రిజర్వ్  పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుందాం. వేటగాళ్లను ఉపేక్షించవద్దు. అటవీ ప్రాంతాల్లో స్థానికులకు జంతుజాలం ఆవశ్యకతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. అదే విధంగా శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లోని అడవుల్లో ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందని అధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణహితమైన ఆధ్యాత్మిక యాత్రలు చేసేలా భక్తులకు అవగాహన కల్పించాలి” అని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రకృతి పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని అభినందిస్తూ రస్కిన్ బాండ్ రాసిన కవితను చదివి వినిపించారు. పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) చిరంజీవి చౌదరికి ‘సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్’ అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ బహూకరించారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved