చంద్రబాబుతో ములాఖత్... భువనేశ్వరికి పరామర్శ... రాజమండ్రిలో పవన్ కల్యాణ్ (ఫోటోలు)
రాజమండ్రి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ కలిసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన పవన్ ఇవాళ రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యారు. పవన్ తో పాటు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కూడా చంద్రబాబును కలిసారు. అనంతరం రాజమండ్రిలోనే వన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పవన్ పరామర్శించారు.
Pawan Kalyan
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుతో ములాఖత్ కు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళుతున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan
టిడిపి అధినేత చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రికి వచ్చిన పవన్ జనసేన నాయకులు, కార్యకర్తలు వెంటరాగా భారీ ర్యాలీగా సెంట్రల్ జైలుకు చేరుకున్నారు.
Pawan Kalyan
రాజమండ్రికి విచ్చేసిన పవన్ కల్యాణ్ ను చూసేందుకు, కలిసేందుకు జనసైనికులే కాదు యువత ఎగబడ్డారు. ఆయన కాన్వాయ్ ను ద్విచక్ర వాహనాలతో పాలో అయ్యారు.
Pawan Kalyan
పవన్ కల్యాణ్ భారీ వాహనాలతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుని చంద్రబాబును కలిసారు. పవన్ రాాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు.
Pawan Kalyan
జనసేనాని పవన్ కల్యాణ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కదిలారు. తమ నాయకుడి వెంట కార్లలో, బైక్స్ పై పార్టీ జెండాలు పట్టుకుని సెంట్రల్ జైలుకు చేరుకున్నారు.
Pawan Kalyan
చంద్రబాబు అరెస్ట్ తో బాధపడుతున్న నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణితో పాటు బాలకృష్ణను పవన్ పరామర్శించారు.
Pawan Kalyan
నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ కల్యాణ్... జైలు వద్దే టిడిపి, జనసేన కలిసి పోటీ చేయనున్నట్లు పవన్ కీలక ప్రకటన చేసారు.
Pawan Kalyan
నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ కల్యాణ్... వీరంతా కలిసే చంద్రబాబును కలిసారు.
Pawan Kalyan
నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ కల్యాణ్... పవన్ తో మాట్లాడుతున్న బాలయ్య
Pawan Kalyan
నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ కల్యాణ్...చంద్రబాబును కలిసి జైలునుండి బయటకు వస్తూ...
Pawan Kalyan
చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.... పక్కనే లోకేష్, బాలకృష్ణతో పాటు ఇతర నాయకులు
Pawan Kalyan
నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ కల్యాణ్... కీలక నిర్ణయం వెల్లడించిన టిడిపి, జనసేన పార్టీలు
Pawan Kalyan
నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ కల్యాణ్... చంద్రబాబుకు మద్దతుగా వైసిపితో పోరాటానికి సిద్దమన్న పవన్
Pawan Kalyan
నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్... చంద్రబాబు భార్య భువనేశ్వరితో పవన్ మాట్లాడారు.