MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Pawan kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆప‌రేష‌న్‌.. అస‌లేం జ‌రిగింది.? ఎప్పుడెలా ఉన్నారు.?

Pawan kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆప‌రేష‌న్‌.. అస‌లేం జ‌రిగింది.? ఎప్పుడెలా ఉన్నారు.?

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 19 2026, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు
Image Credit : Asianet News

అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు

ఏప్రిల్ 17న అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా అస్వస్థత కలిగింది. పరిస్థితిని గమనించిన వెంటనే అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని, హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు.

పరీక్షల తర్వాత శస్త్రచికిత్స నిర్ణయం

ఆస్పత్రిలో చేసిన MRI సహా వివిధ పరీక్షల రిపోర్టులను పరిశీలించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స అవసరం అని తేల్చారు. కొంతకాలంగా కొనసాగుతున్న సైనసైటిస్ సమస్య కారణంగా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండటంతో ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అనంతరం శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.

25
నిల‌క‌డ‌గా ఆరోగ్యం
Image Credit : instagram

నిల‌క‌డ‌గా ఆరోగ్యం

శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కనీసం ఒక వారం నుంచి పది రోజుల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే కొంతకాలం పాటు ఒత్తిడి తగ్గించుకోవడం, ఆహార నియమాలు పాటించడం అవసరం అని పేర్కొన్నారు. పూర్తి కోలుకున్న తర్వాత ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Related Articles

Related image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Related image2
మ‌న‌సును క‌దిలించే అంద‌మైన ప్రేమ క‌థ‌.. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా.? చ‌ల్ల‌టి వ‌ర్షంలాంటి మూవీ
35
నేతలు, కుటుంబ సభ్యుల పరామర్శలు
Image Credit : instagram

నేతలు, కుటుంబ సభ్యుల పరామర్శలు

ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. భార్య అన్నా లెజినోవా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించగా, సాయి ధ‌ర‌మ్ తేజ్‌ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

45
ప్రధాని మోదీ ఫోన్ కాల్… ప్రత్యేక శ్రద్ధ
Image Credit : our own

ప్రధాని మోదీ ఫోన్ కాల్… ప్రత్యేక శ్రద్ధ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై దేశ ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ కూడా ఆరా తీశారు. ఆయనకు నేరుగా ఫోన్ చేసి పరామర్శిస్తూ, త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ చర్య ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత స్పష్టం చేసింది.

55
అభిమానుల్లో ఊరట
Image Credit : X/Pawan Kalyan

అభిమానుల్లో ఊరట

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే మరింత ఉత్సాహంతో తిరిగి తన బాధ్యతలను చేపడతారని అందరూ ఆశిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
Recommended image2
Now Playing
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu
Recommended image3
Now Playing
మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
Related Stories
Recommended image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Recommended image2
మ‌న‌సును క‌దిలించే అంద‌మైన ప్రేమ క‌థ‌.. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా.? చ‌ల్ల‌టి వ‌ర్షంలాంటి మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved