MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో రానున్న రోజుల్లో జరిగే మార్పులివే.. కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీలో రానున్న రోజుల్లో జరిగే మార్పులివే.. కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

‘గతంలో రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే మమ్మల్ని అడ్డుకున్నారు. ఉమ్మడి ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్‌లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు’ అని డిప్యటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

2 Min read
Galam Venkata Rao
Published : Aug 05 2024, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులను సైతం గత ప్రభుత్వం అవమానించిందన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం దెబ్బలు తిన్నామని.. భరించామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏనాడూ ఇటువంటి ఇబ్బందులు పడలేదన్నారు. 

24

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌ రెండో అంతస్తులో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

‘మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అధికారం కట్టబెట్టారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో, మంచి ఓటింగ్ శాతంతో చారిత్రాత్మక విజయం సాధించాం. వ్యవస్థలను బ్రతికించాలని, వ్యవస్థలను బలోపేతం చేయాలని మేం అధికారంలోకి వచ్చాం. ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడాం. గెలిచాం. మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ సూచనలు చాలా ముఖ్యం. రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. గతంలో రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే మమ్మల్ని అడ్డుకున్న పరిస్థితి. గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు.’

34

‘గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. పాలనను ఛిద్రం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌లను ఆటబొమ్మలు చేయడం బాధ కలిగించింది. పతనమైన వ్యవస్థను పటిష్టం చేస్తాం. ఇందుకోసం అధికారులు వేగంగా, నిజాయితీగా పని చేయాలి. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఏపీ అనేది ఒకప్పుడు ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండేది..గత ఐదేళ్లుగా చేసిన విధ్వంసంతో ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో అన్నదానికి ఉదాహరణగా ఏపీ నిలిచింది.’ 

‘రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత,అనుభవం, దార్శనికత నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కోసం మేము కష్టపడుతాం. రాజ్యాంగాన్ని కాపాడటంలో మాకు చంద్రబాబు మార్గదర్శకత్వం అందిస్తారని మేం భావిస్తున్నాం. మా తరపున ఏమైనా తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి. మేము సరిదిద్దుకుంటాం. ప్రత్యేకించి మా మంత్రుల శాఖలో ఏవైనా లోపాలు కనిపించినా.. మా దృష్టికి తీసుకురండి.. మేము వాటిని పరిష్కరిస్తాం. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మాణం చేపడతాం. మంచినీరు అన్ని గ్రామాలకు అందించడమే మా లక్ష్యం. 5.40 లక్షల మంచినీటి కుళాయిలను కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్కిల్ సెన్సెస్ కోసం అధికారుల సలహాలు, సూచనలు అవసరం. వికసిత ఆంద్రప్రదేశ్ కోసం అధికారులు సూచనలు చాలా ముఖ్యం. జవాబుదారీతనంతో కూడుకున్న ప్రభుత్వం వచ్చింది. గ్రామసభలు ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీలను బలోపేతంచేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ఒక మహత్కార్యం. ఫైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నుండి ప్రారంభిస్తాం.’

44

‘4,781 కిలోమీటర్ల రోడ్లు వేయాలని చర్యలు తీసుకుంటున్నాం. అటవీ శాఖపై ప్రత్యేక దృష్టిసారించాం. గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరిలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంజాబీ వర్సిటీ ప్రొఫెసర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. స్కిల్ సెన్సెస్ కు సంబంధి యువతకు దిశానిర్దేశం చేయాలి. వికసిత్ భారత్ కు పాటుపడదాం.’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఏఎస్ అధికారులకు పిలుపునిచ్చారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Recommended image2
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
Recommended image3
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved