పుట్టెడు కష్టాల నుండి HCL లో ఉద్యోగం వరకు... ఓ తెలుగింటి ఆడబిడ్డ సక్సెస్ స్టోరీ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 పథకం ఓ ఆడబిడ్డ జీవితాన్ని మార్చేసింది… పుట్టెడు కష్టాల నుండి గట్టెక్కించింది. ఆమె సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం.

ఓ తెలుగింటి ఆడబిడ్డ స్టోరీ
Success Story : ఈకాలం యువత చిన్నచిన్న కష్టాలనే భరించలేకపోతున్నాయి... అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, ఫెయిల్ అయ్యారని, అప్పు అయ్యిందంటూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో ఓ యువతి ఎన్నికష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించింది... చివరకు చంద్రబాబు సర్కార్ సాయంతో మంచి ఉద్యోగం సాధించింది. ఇప్పుడామె కష్టాలు తీరిపోయాయి... ఆమె పోరాటం నేటి యువతకు ఆదర్శంగా మారింది. ఈమె సక్సెస్ స్టోరీ చివరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు చేరింది... ఆయనే స్వయంగా అందరిముందు ఆమెను అభినందించారు. ఇలా చంద్రబాబు మెచ్చిన షేక్ పావని సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
షేక్ పావని కన్నీటిగాధ...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పథకం P4. ఈ కార్యక్రమాన్ని తెలుగు సంవత్సరాది ఉగాది పండగపూట లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఈ పి4 పథకం ఓ యువతి జీవితాన్నే మార్చేసింది... తన కష్టాలను స్వయంగా సీఎం చంద్రబాబు ముందే చెప్పుకుందామె. అలాగే P4 పథకం తన జీవితాన్ని ఎలా మార్చిందో కూడా తెలిపారు.
షేక్ పావని... కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వీరపనేనిగూడెంకు చెందిన యువతి. ఈమెకు చిన్నప్పటినుండి కష్టాలే... తెలిసీతెలియని వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి ప్రేమకు దూరమైన పావనిని తల్లి ఎన్నో కష్టాలకు ఓర్చి చదివించింది. అయితే ఇంటర్మీడియట్ పూర్తవగానే మంచి సంబంధం రావడంతో పెళ్లిచేసి పంపించింది ఆ తల్లి. ఇలా చిన్నవయసులోనే పెళ్ళిపీటలెక్కింది పావని.
పుట్టినింట్లో తండ్రి ప్రేమకు దూరమైన పావనికి మెట్టినింట్లోనూ అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. పెళ్లయిన ఏడాదికే భర్త ప్రమాదవశాత్తు మరణించాడు. అప్పటికే ఆమెకు మూడునెలల బిడ్డ ఉన్నాడు. ఇలా భర్తను కోల్పోయిన పావని పసిబిడ్డతో కలిసి మళ్లీ పుట్టింటికి చేరింది. కన్నబిడ్డతో పాటు మనవడి పోషణభారం కూలి పనులు చేసుకునే ఆ తల్లిపై పడింది.
బిడ్డ కాస్త పెద్దయ్యాక తల్లికి భారంగా ఉండకూడదని భావించిన పావని ఏదైనా ఉద్యోగం చేయాలని భావించింది. కానీ ఆమెకు పెద్ద విద్యార్హతలు, కమ్యూనికేషన్ సిల్స్, గతంలో ఎక్కడా పనిచేసిన అనుభవం లేకపోవడం ఉద్యోగం లభించలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయిన ఆమెకు పి4 పథకం ఆదుకుంది... దీంతో కన్నీటి కష్టాలు తొలగిపోయి ఇప్పుడు ఇతర మహిళలకు ఆదర్శంగా మారింది పావని.
నిరాశ నుంచి ఆశావహ దృక్పథం వైపు పావనిని నడిపించిన పీ-4
తల్లి తండ్రి వేరు పడ్డారు. చిన్న వయసులోనే పెళ్లయింది. ఒక బిడ్డ పుట్టాక భర్త పోయాడు. నిరాశ, నిస్పృహ కమ్మేసాయి. తల్లి కూలి పనులు చేస్తూ పోషిస్తోంది.
ఇదీ కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం వి ఆర్ పి గూడెంకి చెందిన పావని వ్యధార్ధ గాథ..… pic.twitter.com/FgqbP9FT4u— Telugu Desam Party (@JaiTDP) August 19, 2025
పావని సక్సెస్ స్టోరీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కోసం P4 పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పావని కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే మంచి ఉద్యోగాన్ని సాధించింది. ప్రముఖ కంపెనీ HCL పావనిని దత్తత తీసుకుని రెండు నెలలపాటు ఉద్యోగానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చింది. ఇలా పావని కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు వర్కింగ్ స్కిల్స్ నేర్పించి ఉద్యోగంలో చేర్చుకున్నారు... ప్రస్తుతం మంచి సాలరీ పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటుందామె.
సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ-4 పథకం కారు చీకటిలో మగ్గుతున్న పావని జీవితంలో కాంతి పుంజమయ్యింది. ఆమె కన్నీటిని తుడిచి కలల సాకారం వైపు అడుగులు వేయించింది. దీంతో తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తన సక్సెస్ స్టోరీని చెబుతూ పావని ఎమోషన్ అయ్యింది... ఆనందభాష్పాలతో ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. పావని కష్టాలు P4 పథకం ద్వారా తీరిపోయాయని తెలిసి చంద్రబాబు ఆనందించారు.
పావని సక్సెస్ స్టోరీపై చంద్రబాబు కామెంట్స్...
షేక్ పావని మాదిరిగానే ప్రతిఒక్కరు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలలుకంటారు... కానీ వారికి సరైన అవకాశాలు ఉండవన్నారు సీఎం చంద్రబాబు. అలాంటివారి కోసమే ఈ పి4 పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. పావనికి శక్తి, తెలివితేటలు ఉన్నాయి... పైకి రావాలనే తపన ఉంది...కానీ అవకాశాలు లేవు.. P4 పథకం ద్వారా ఆమెకు ఆలోచనను ఆచరణలో పెట్టే దారి దొరికిందన్నారు. పావని ఇప్పుడు అందరికీ మార్గదర్శిగా మారారని చంద్రబాబు అన్నారు. ఒకరిద్దకు కాదు సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉంటాయి.. అలాంటివారిని పేదరికం నుండి బయటకు తీసుకువస్తామని... అందరికీ సమాన అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవంగా జీవించేలా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
P4 పథకమే లేకుంటే, ప్రభుత్వ సాయం అందకుంటే పావని ఏ కూలీపనులో చేసుకోవాల్సి వచ్చేదని చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పుడు ఆమె ఏడాదికి లక్షల రూపాయల సాలరీతో మంచి ఉద్యోగం చేసుకుంటోందని అన్నారు. ఇలా బంగారు కుటుంబాలు, మార్గదర్శకులు వండర్స్ చేస్తున్నారన్నారు. నిరాశ నుంచి ఆశావహ దృక్పథం వైపు పావనిని నడిపించిన పీ-4 అద్భుత పథకమని నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు.
పీ4 మార్గదర్శి దిశా నిర్దేశంలో ఉద్యోగ అవకాశం పొంది కుటుంబానికి ఆధారంగా నిలిచిన కృష్ణా జిల్లావాసి పావని, "సూపర్ సక్సెస్" స్టోరీ వివరించిన సీఎం. #P4Model#Margadarsi_BangaruKutumbam#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/YUjjqFdB26
— Telugu Desam Party (@JaiTDP) August 19, 2025