MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradhesh:ఇక ప్రతినెలా వారి అకౌంట్లోకి రూ.3 వేలు...కొత్త పథకం గురించి చెప్పిన లోకేశ్‌!

Andhra Pradhesh:ఇక ప్రతినెలా వారి అకౌంట్లోకి రూ.3 వేలు...కొత్త పథకం గురించి చెప్పిన లోకేశ్‌!

నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు, మహిళలకు ఆర్థిక భద్రత గురించి మంత్రి నారా లోకేష్ మచిలీపట్నంలో కీలక ప్రకటన చేశారు.

2 Min read
Bhavana Thota
Published : Jun 26 2025, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నిరుద్యోగ భృతి
Image Credit : ANI

నిరుద్యోగ భృతి

ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేష్ మచిలీపట్నం పర్యటనలో యువత, మహిళలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఆయన ప్రకటించిన ప్రకారం, టీడీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా పేర్కొన్న నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాదిలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ పథకం కింద అర్హత కలిగిన నిరుద్యోగుల ఖాతాల్లో ప్రతి నెల రూ.3,000 చొప్పున వార్షికంగా రూ.36,000 జమ చేస్తామని తెలిపారు. “యువత కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తాం” అని స్పష్టం చేశారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ పథకం ముఖ్యమని చెప్పారు.

26
కార్యకర్తలే టీడీపీకి బలం
Image Credit : google

కార్యకర్తలే టీడీపీకి బలం

కార్యకర్తలే టీడీపీకి బలం “టీడీపీకి కార్యకర్తలే ప్రాణం. వారి కృషికి న్యాయం చేయడమే మాకు ప్రాధాన్యం” అని లోకేష్ చెప్పారు. టెక్నాలజీ సహాయంతో వారి సేవలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తప్పులు చేసినవారెవరు అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related Articles

Related image1
Nara lokesh: కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు..నిందితులను కఠినంగా శిక్షిస్తాం..!
Related image2
Now Playing
మూడు సంవత్సరాల్లో 4 లక్షల యువతకు ఉచితంగా ఐటీ, క్లౌడ్ శిక్షణ | Nara Lokesh | Asianet News Telugu
36
తల్లిదండ్రులతో సమావేశాలు
Image Credit : others

తల్లిదండ్రులతో సమావేశాలు

రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులతో సమావేశాలు ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని లోకేష్ తెలిపారు. జూలై 5న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

46
తల్లికి వందనం’
Image Credit : others

తల్లికి వందనం’

మహిళల కోసం ‘తల్లికి వందనం’ పథకం లోకేష్ తన ప్రసంగంలో మహిళల సాధికారత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక, సామాజికంగా అండగా నిలుస్తున్నామని చెప్పారు. “ఈ పథకం లబ్ధిదారులు తల్లులు మాత్రమే కాదు. వారి పిల్లల విద్యా భవిష్యత్తుకూ ఇది బలమైన పునాది” అని వ్యాఖ్యానించారు.

56
ప్రజల మద్దతుతో అధికారం
Image Credit : others

ప్రజల మద్దతుతో అధికారం

ప్రజల మద్దతుతో అధికారం టీడీపీ అధిక మెజారిటీతో అధికారంలోకి రావడంపై మాట్లాడుతూ, “94 శాతం సీట్లు గెలవడం వెనుక ప్రజల తీర్పు ఉంది. మా విజయానికి కారణం ప్రజలే” అని పేర్కొన్నారు. తన తల్లి భువనేశ్వరి చంద్రబాబు విజయానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, తానూ భార్య బ్రాహ్మణితో కలిసి ఇంటి పనుల్లో పాల్గొంటానని చెప్పారు.

66
గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన లోకేష్
Image Credit : our own

గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన లోకేష్

గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన లోకేష్ వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించిన లోకేష్, “గతంలో రెడ్‌బుక్ చూపించి బెదిరించిన వాళ్లు ఇప్పుడు భయపడుతున్నారు” అన్నారు. గత ప్రభుత్వ అవకతవకలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన 29 కేసుల్లో ఇప్పటికే 20 కేసులు తొలగించామని, మిగిలినవి కూడా త్వరలోనే రద్దు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తనపై పెట్టిన 23 కేసులు, అందులో SC, ST అట్రాసిటీ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు 54 రోజులు, రవీంద్ర 53 రోజులు జైలులో గడిపిన విషయాన్ని వివరించారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved