నారా భువనేశ్వరి యాక్టివ్ పాలిటిక్స్ ... ఆ అసెంబ్లీపైనే కన్నేసారుగా..!
అటు పుట్టింటికి... ఇటు అత్తవారింటికి రాజకీయ నేపథ్యం వుంది... అయినా ఇంతకాలం రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేరు నారా భువనేశ్వరి. అయితే ఇటీవల కాలంలో ఆమె రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంతకూ ఏమిటా అనుమానాలంటే...
Nara Bhuvaneshwari
Nara Bhubvaneshwari : నారా భువనేశ్వరి... తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భార్య, మంత్రి లోకేష్ మాతృమూర్తి, హీరో నందమూరి బాలకృష్ణ చెల్లి... ఇలా ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. అంతేకాదు స్వయంగా ఆమె వ్యాపారవేత్త కూడా... హెరిటేజ్ ఫుడ్స్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. ఇలా మంచి కూతురు, భార్య, తల్లి, చెల్లి, వ్యాపారవేత్తగా వున్న ఆమె ఇప్పుడు మంచి నాయకురాలు అనిపించుకుంటున్నారు. భర్త జైలుకు వెళ్లడంతో అనుకోకుండా రాజకీయాలవైపు వచ్చిన ఆమె ఇప్పటికీ యాక్టివ్ గా వుంటున్నారు. దీంతో ఆమె రాజకీయా నాయకురాలిగా మారతారన్న ప్రచారం జరుగుతోంది.
Nara Bhuvaneshwari
అయితే నారా కుటుంబం ఇప్పటికే భువనేశ్వరి రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అయినా ఆమె పొలిటికల్ యాక్టివిటీస్ ఈ అనుమానాలను సజీవంగా వుంచుతున్నాయి. ఇలా తాజాగా భువనేశ్వరి భర్త చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పర్యటన ఆసక్తికరంగా మారింది.
Nara Bhuvaneshwari
ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ అభివృద్ది దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఆమె ఇవాళ కుప్పంలో పర్యటించి నియోజకవర్గ సమన్వయ కమిటీతో సమావేశమయ్యారు.
Nara Bhuvaneshwari
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యన్నారు. దీన్ని తాను బలంగా నమ్ముతానని తెలిపారు. ఈ టీమ్ వర్క్ వల్లే రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చామన్నారు. అయితే మనం గెలిచాం... ఆ గెలుపు ఫలాలను ప్రజలకు అందించాలని అన్నారు.ఇందుకోసం సమన్వయ కమిటీ కంకణబద్దులు కావాలని భువనేశ్వరి సూచించారు.
Nara Bhuvaneshwari
మన కార్యకర్తలు, ఓటర్లను దృష్టిలో పెట్టుకోవాలి...వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి... అప్పుడే వారు సంతోషంగా ఉంటారన్నారు. కుప్పం పర్యటనలో సామాన్యులంతా రోడ్లు, లైట్లు, కుళాయిలు, రెవెన్యూ సమస్యలు అత్యధికంగా తన దృష్టికి తెస్తున్నారని... వాటిపై సమన్వయ కమిటీ, అధినాయకత్వం దృష్టి పెట్టాలని భువనేశ్వరి సూచించారు.
Nara Bhuvaneshwari
కుప్పం నియోజకవర్గ అభివృద్ది, ప్రజల సంక్షేమమే తన ధ్యేయం... ఇందుకోసం ప్రతి 3నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వస్తానని భువనేశ్వరి తెలిపారు.ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుపుకోసం కృషిచేసిన సమన్వయ కమిటీ సభ్యులందరికీ నారా భువనేశ్వరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.