పెద్దమ్మ ఆశీర్వాదం... చిన్నారి పలకరింపు... వసంతమ్మ ఫ్యామిలీకి భువనమ్మ ఆత్మీయ పరామర్శ (ఫోటోలు)
చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలతో మనస్తాపానికి గురయిన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు రేణిగుంట మండలం మునగళ్లపాలెంకు చెందిన యంగిటీల వసంతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.
Nara Bhuvaneshwari
తిరుపతి : అవినీతి కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నెలరోజులకు పైగా జైల్లోనే వుంటున్నాడు. టిడిపి అధికారంలో వుండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరిట స్కాం జరిగిందని... ఇందులో ప్రధాన పాత్ర ఆనాటి సీఎం చంద్రబాబుదే అని వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సిఐడితో స్కిల్ స్కాం పై విచారణ జరిపించి చంద్రబాబును అరెస్ట్ చేయించారు. దీంతో తండ్రి, భర్త ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలోనే కాదు ఏనాడూ రాజకీయాల జోలికి రాని నారా భువనేశ్వరి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడపాల్సి వస్తోంది.
Nara Bhuvaneshwari
భర్త చంద్రబాబు నాయుడి కోసం ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు టిడిపిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు భువనేశ్వరి. తండ్రిని జైల్లోంచి బయటకు తీసుకువచ్చేందుకు లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నాడు. దీంతో అత్తాకోడలు భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల్లోకి వెళుతూ చంద్రబాబు ఏ తప్పూ చేయకున్నా అరెస్ట్ చేసారని వివరిస్తున్నారు. ఇలా చంద్రబాబు జైలుకు వెళ్లిన నాటినుండి భువనేశ్వరి ప్రజల్లోనే వుంటూ పోరాటం చేస్తున్నారు.
Nara Bhuvaneshwari
తాజాగా చంద్రబాబు అరెస్ట్ తో మనస్తాపానికి గురయి మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న కుటుంబాలను ఓదారుస్తున్నారు. బాధలో వున్న కుటుంబసభ్యులకు టిడిపి అండగా వుంటుందని భువనేశ్వరి ధైర్యం చెబుతున్నారు.
Nara Bhuvaneshwari
'నిజం గెలవాలి' పేరిట భువనేశ్వరి చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రారంభమయ్యింది. వివిధ నియోజకవర్గాల మీదుగా ఈ బస్సు యాత్ర సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలతో మనస్తానికి గురయి మరణించిన వారికి నివాళి అర్పిస్తూ... కుటుంబసభ్యులకు పరామర్శిస్తూ భువనేశ్వరి యాత్ర సాగుతోంది.
Nara Bhuvaneshwari
తాజాగా రేణిగుంట మండలం మునగళ్లపాలెంకు చెందిన యంగిటీల వసంతమ్మ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. టిడిపి నాయకులతో కలిసివెళ్లి వసంతమ్మ ఫోటోకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన భువనేశ్వరి టిడిపి అండగా వుంటుందని భరోసా ఇచ్చారు.
Nara Bhuvaneshwari
వసంతమ్మ కుటుంబసభ్యులతో భువనేశ్వరి చాలాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ బాధపడుతున్న భువనేశ్వరిని మేమంతా అండగా వున్నామని వసంతమ్మ కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణులు ధైర్యం చెప్పారు.