MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Nagababu: నాగబాబుకు తెలంగాణలో ఇన్ని కోట్ల ఆస్తి ఉందా.? ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలుసా..

Nagababu: నాగబాబుకు తెలంగాణలో ఇన్ని కోట్ల ఆస్తి ఉందా.? ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలుసా..

నాగబాబుకు పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థికంగా తనకు పవన్ అండగా నిలిచారని పలుసార్లు నాగబాబు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా తన సోదరుడికి ఉన్నత స్థానాన్ని అందించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.  

2 Min read
Narender Vaitla
Published : Mar 09 2025, 11:23 AM IST| Updated : Mar 09 2025, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జనసేన పార్టీ మొదలైన నాటి నుంచి పార్టీకి మద్ధతుగా నిలుస్తున్నారు నాగబాబు. ఓవైపు చిరంజీవి పెద్దగా రాజకీయాలపై ఆసక్తి చూపని సమయంలో కూడా నాగబాబు పవన్‌ కళ్యాణ్‌ వెన్నంటే నిలిచారు. ఈ నేపథ్యంలోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన భారీ విజయాన్ని అందుకుంది. వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని అందుకుంది. 

అయితే నాగబాబు మాత్రం ఎన్నికల బరిలో నిలవలేదు. ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా దానికి నాగబాబు ఆసక్తి చూపలేదని వార్తలు వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు అవకాశం కల్పించారు. పొత్తు ధర్మంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. మరి నాగబాబు ప్రకటించిన అప్పులు, ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

24

పవన్‌, చిరు దగ్గర అప్పులు:

నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్‌లో మెగా బ్రదర్స్‌ దగ్గర అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు, పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు ప్రకటించారు. అలాగే బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7.54 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. 
 

34

మొత్తం ఆస్తులు ఎంతంటే: 

నాగబాబు తనకు మొత్తం రూ. 70 కోట్ల ఆస్తులున్నాయని, తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని స్పష్టం చేశారు. ఇక నాగబాబు తనకు మొత్తం రూ. 59 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు – రూ.55.37 కోట్లు, చేతిలో రూ. 21.81 లక్షలున్నట్లు పేర్కొన్నారు. ఇక బ్యాంకు నిల్వలు రూ.23.53 లక్షలు, 
ఇతరులకు ఇచ్చిన అప్పులు – రూ.1.03 కోట్లుగా వెల్లడించారు. అలాగే తనకు రూ. 67.28 లక్షల విలువైన బెంజ్‌ కారు, రూ. 11.04 లక్షల హ్యుందాయ్‌ కారు ఉందన్నారు. వీటితో పాటు రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు) ఉన్నట్లు పేర్కొన్నారు. 
 

44
Nagababu

Nagababu

భూముల వివరాలు.. 

నాగబాబు తాను ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్‌లో హైదరాబాద్ పరిసరాల్లో రూ. 11 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రూ. 5.3 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ. 82.80 లక్షల 8.28 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో రూ. 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి, మణికొండలో రూ. 2.88 కోట్ల విలువైన విల్లా ఉన్నట్లు పేర్కొన్నారు. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Recommended image2
Now Playing
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu
Recommended image3
Now Playing
Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved