MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఛీ..ఈమె తల్లేనా... కూతుర్ని హీరోయిన్ చేయాలని.. రోజూ ఇంజక్షన్లు.. తట్టుకోలేని ఆ బాలిక ఏం చేసిందంటే..

ఛీ..ఈమె తల్లేనా... కూతుర్ని హీరోయిన్ చేయాలని.. రోజూ ఇంజక్షన్లు.. తట్టుకోలేని ఆ బాలిక ఏం చేసిందంటే..

కూతుర్ని హీరోయిన్ చేయాలనుకున్న ఓ తల్లి ఆమె పెద్దదానిలా కనిపించడానికి ఇంజక్షన్లు చేయించింది. ఆ బాధ తట్టుకోలేని ఆ బాలిక 1098కి ఫోన్ చేసింది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 03 2023, 06:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
minor girl

minor girl

విజయనగరం : సినిమాలో హీరోయిన్…ఆ తళుకు, బెళుకు…ఆ లావణ్యం.. వైభోగం.. గ్లామర్, క్రేజ్…రంగుల తెరమీద చూసేవారిని ఒక ఊహలోకంలోకి తీసుకు వెళుతుంది. ఇక టీనేజ్ అమ్మాయిలయితే.. ఆ హీరోయిన్లలో తమను ఊహించుకుని కలల ప్రపంచంలో మునిగితేలుతుంటారు. సినిమాపై మోజు పెంచుకొని నిజజీవితంలో వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అలా సినిమా మీద మోజుతో ఓ తల్లి  అత్యంత దారుణానికి తెగబడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కూతురిని సినిమా హీరోయిన్ చేయాలని అనుకుంది ఆమె. అలా అనుకున్నది బాగానే ఉంది కానీ దాని కోసం.. చెప్పుడు మాటలు విని చేసిన పని ఆ చిన్నారి పాలిట ప్రత్యక్ష నరకంలా తయారైంది. తన కూతురి ‘త్వరగా పెద్దదాన్ని చేయాల’ని.. వయసుకు మించిన శారీరక పరిణతి కనిపించేలా చేయాలన్న దుగ్థతో ఇంజక్షన్లను  ఆశ్రయించింది. స్వయంగా తానే కూతురికి ఇప్పించడం మొదలుపెట్టింది. కానీ ఆ బాధను కూతురు భరించలేకపోయింది.  

38

ఎలాగో తల్లి నుంచి తప్పించుకుని చైల్డ్ లైన్ విభాగానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణమైన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో చోటుచేసుకుంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసరి అప్పారావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇలా తెలిపారు… ఏపీలోని విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని  ఓ మహిళ(40)కు ఓ కుమార్తె ఉంది.   కూతురు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. 

48

ఆ తర్వాత కొంతకాలానికి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొంతకాలానికి రెండో భర్త కూడా ఆమెను వదిలిపెట్టి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ మహిళ మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇక మొదటి భర్త చనిపోయిన తర్వాత ఆ మొదటి కూతురిని హాస్టల్లో ఉంచి చదివిపిస్తుంది. విశాఖపట్నంలోని ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకుంటున్న ఆ బాలిక (15) ఇటీవలే పదో తరగతి పాస్ అయింది. పరీక్షలు అయిపోయి సెలవులు రావడంతో ఇంటికి వచ్చింది.

58

అయితే తల్లి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న సంగతి ఆమెకు నచ్చలేదు. తరచుగా తల్లి దగ్గరికి  ఎవరెవరో వస్తుండడంతో అక్కడ ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. ఈ విషయంలో తల్లి కూతుర్ల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తల్లి దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి కూతురిని చూశాడు. ఆమెకు సినిమాల్లో హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని తల్లికి చెప్పాడు. కానీ, కొన్ని అవయవాలు ఇంకాస్త బొద్దుగా పెరగాలని నమ్మించాడు. దీంతో తల్లి టెంప్ట్ అయింది. 

68

కూతుర్ని సినిమా హీరోయిన్ చేయాలని అనుకుంది. దీనికోసం ఆ వ్యక్తి చెప్పినట్టుగా కూతురికి రోజు ఏవేవో ఇంజక్షన్లు ఇప్పించడం మొదలుపెట్టింది. వాటి వల్ల  చిన్నారి అనారోగ్యం బారిన పడింది. బాధ భరించలేకపోయింది. తనకి ఇంజక్షన్లు వేయించవద్దని తల్లిని వేడుకున్నా విడిచిపెట్టలేదు. దీంతో ఇక తట్టుకోలేని ఆ బాలిక గురువారం రాత్రి 1098 కు ఫోన్ చేసింది. 

78

చైల్డ్ లైన్ సిబ్బందికి  తన భయంకరమైన పరిస్థితిని వివరించింది. ఆమె చెప్పింది అంతా విన్న తరువాత.. వారు వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో… వారు పోలీసుల సహాయంతో బాలిక ఇంటికి వెళ్లి ఆమెను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

88

ఆ తర్వాత విశాఖపట్నంలోని స్వధార్ హోంకు ఆ బాలికను పంపించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకోవాలని దిశా పోలీస్ లను కోరినట్లు రాష్ట్ర పాలన హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసరి అప్పారావు తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Amaravati: రూ. 2500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 2 టవర్లు, 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం..
Recommended image2
Now Playing
AP & TElangana Rain Alert! వాతావరణశాఖా హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు |
Recommended image3
Now Playing
YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved