పెద్ద మనసుకి హ్యాట్సాఫ్: సీఎం జగన్ బర్త్ డే కి రోజా సూపర్ గిఫ్ట్
First Published Dec 21, 2020, 9:52 AM IST
సీఎం జగన్ పుట్టినరోజు నాడు తల్లిదండ్రులను కోల్పోయిన ఒక చిన్నారి విద్యకు అయ్యే మొత్తం ఖర్చును భరించడానికి ఎమ్మెల్యే రోజా ముందుకు వచ్చి, ఇదే సీఎం జగన్ కి బర్త్ డే గిఫ్ట్ అని చెప్పారు.

ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినమైన నేటిని అందుకు తేదీగా ఎంచుకొని తల్లిదండ్రులను కోల్పోయిన ఒక చిన్నారి జీవితంలో వెలుగులు నింపారు ఈ జబర్దస్త్ ఎమ్మెల్యే.

పి. పుష్పకుమారి అనే ఒక విద్యార్థిని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది. డాక్టర్ అవ్వాలనే తన కలను మాత్రం కోల్పోని ఆ అండగా నిలిచి, ఆ చిన్నారి చదువుకయ్యే పూర్తి ఖర్చును భరించడానికి ముందుకు వచ్చారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?