ఆ ఒక్క నియోజకవర్గ యువతకే 10వేల ఉద్యోగాలు: మంత్రి మేకపాటి
First Published Dec 30, 2020, 4:19 PM IST
చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనం సీఎం జగనేనని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

ఆత్మకూరు: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలపై పరిశ్రమలు,ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా నియోజవర్గంలోని నిరుద్యోగ యువతకు తీపికబురు అందించారు. ఒక్క ఆత్మకూరు నియోజవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకే 10వేల ఉద్యోగాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సొంత నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్ట ప్రాంత ప్రజలు వలస వెళ్లే అవసరం లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 169 లే-అవుట్లలోని 9522 గృహాలకు పట్టాల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనే 1,050 ఇళ్లకు పట్టాలు అందించామన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?