చంద్రబాబుకు షాక్: బిజెపిలోకి జేసి బ్రదర్స్, పరిటాల సునీత

First Published 7, Jun 2019, 11:46 AM IST

 పలువురు కీలకమైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి కీలక నేత రాం మాధవ్ రంగంలోకి దిగారు.

అనంతపురం: పలువురు కీలకమైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి కీలక నేత రాం మాధవ్ రంగంలోకి దిగారు. ఆయన టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

జెసీ బ్రదర్స్, పరిటాల ఫ్యామిలీలతో పాటు పల్లె రఘునాథ రెడ్డి, వరదాపురం సూరి తదితరులు బిజెపిలో చేరే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి అధిష్టానం ఇప్పటికే వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోవడమే మిగిలిందని అంటున్నారు.

శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో ఘోరంగా దెబ్బ తిన్నది. తమకు తిరుగులేదని భావించిన జెసి కుటుంబ సభ్యులకు, పరిటాల కుటుంబ సభ్యులకు ఎదురుగాలి తప్పలేదు. జిల్లాలోని 14 స్థానాల్లో 12 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎగరేసుకుపోయింది.

అనంతపురం జిల్లాలో హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి చంద్రబాబు బావమరిది, నందమూరి హీరో బాలకృష్ణ విజయం సాధించగా, ఉరవకొండ నుంచి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. హేమాహేమీలని అనుకున్నవాళ్లంతా మట్టి కరిచారు.

రాజకీయాల నుంచి తప్పుకున్న జేసి బ్రదర్స్ తమ వారసులను ఎన్నికల్లో పోటీకి దించారు. అయితే, వారు ఓటమి పాలయ్యారు. ఈ స్థితిలో వారు తమ కుమారులతో చర్చించి, టీడీపికి భవిష్యత్తు లేదని చెప్పినట్లు తెలుస్తోంది. తాము బిజెపిలో చేరే విషయంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన జేసీ బ్రదర్స్ వారసు

రాప్తాడు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పరిటాల సునీత కాకుండా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీకి దిగారు. అయితే, ఆయన ఓటమి పాలయ్యారు. బిజెపిలో చేరేందుకు వారు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. బిజెపి  నేతలతో ఇప్పటికే వారు ఆ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

loader