MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వెనుక డోర్‌ తెరు­చుకోవడం లేదు.. ఎమ్మెల్యేల కంటే దారుణంగా జగన్ పరిస్థితి

వెనుక డోర్‌ తెరు­చుకోవడం లేదు.. ఎమ్మెల్యేల కంటే దారుణంగా జగన్ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం తన చుట్టూ ఇద్దరంటే ఇద్దరే భద్రతాధికారులు ఉంటున్నారు. కనీసం ప్రజలను కలవకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ హైకోర్టుకు తెలిపారు.

3 Min read
Galam Venkata Rao
Published : Aug 06 2024, 04:52 PM IST| Updated : Aug 06 2024, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గతంలో తనకున్న జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ ఆయన 
ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో 03–06–2024 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. 
అంతేగాక.. పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్‌ అసాల్ట్‌ టీమ్స్, జామర్లను సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలన్నారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

26

నన్ను ప్రమాదంలోకి నెట్టేందుకే.. 

‘ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న జెడ్‌ ప్లస్‌ భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతూ మా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కూటమి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. నన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు, వ్యక్తిగతంగా నేను దాడులకు గురయ్యేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో గత రెండునెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస కొనసాగుతోంది’ అని జగన్ తెలిపారు.

36

‘ఇంత జరుగుతున్నా పోలీసు పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాకున్న ప్రాణహానిని సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఉపసంహరించింది.

నా భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఎలాంటి స్పందనలేదు. నా జీవితాన్ని, స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు ఈ అధికార కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోంది. ఉన్నపళంగా, అకారణంగా, ఏకపక్షంగా నాకున్న భద్రతను కుదించింది. ఇటీవల నా భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదు. కూటమి ప్రభుత్వ పెద్దల పల్లకీలు మోస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ విధులను వారు విస్మరించడం వల్లే ఇటీవల కాలంలో మా పార్టీ కేడర్‌పై, ఆస్తులపై వ్యవస్థీకృత హింస పెరిగిపోయింది. దీనిపై మేం ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. నన్ను భౌతికంగా లేకుండా చేయడమే అధికార కూటమి లక్ష్యం.. ఈ విషయంలో టీడీపీ సీనియర్‌ నేతల మధ్య సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు నా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని’ ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక.. చచ్చేవరకు కొట్టాలని కూడా వారు మాట్లాడుకున్నారు..’ అని జగన్ పేర్కొన్నారు.  

46

రక్షణగా ఇద్దరు అధికారులే..

‘రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది. అయితే, అధికార పార్టీ కూటమి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్, నేతలపై దాడులు జరగడానికి పునాది. నా భద్రతను కుదించేందుకు అధికారుల వద్ద సహేతుక కారణాలుగానీ, ఆధారాలుగానీ ఏమీలేవు. అత్యున్నత భద్రత వ్యవస్థ అయిన జెడ్‌ ప్లస్‌ నుంచి నా భద్రతను కుదించారు. వాస్తవానికి జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను తొలగించనప్పటికీ, నా చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని మాత్రం బాగా కుదించారు.’

56

నిరంతరం బెదిరింపులు ఎదుర్కొంటున్నా... 

‘నాకు రక్షణగా ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నారు. నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. అధికార పార్టీ నుంచి నిరంతరం నేను బహిరంగ బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. అందువల్ల ప్రభుత్వం నాకు ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. నాకు అత్యంత సమీపంలో ఉండే క్యాట్‌ ఆక్టోపస్‌ టీమ్స్‌ను ఈ ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉంటున్నారు. గతంలో ఇలా 10 మంది ఉండేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల కంటే నా వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల సంఖ్యే తక్కువ. గతంలో ఇల్లు, ఆఫీసు వద్ద 11 మంది గార్డులు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు.’ 

66
YS Jagan

YS Jagan

బయటకొచ్చే పరిస్థితి లేదు..

‘ఇక నా భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందన్న విషయం నాకు రక్షణగా ఇచ్చిన బుల్లెట్‌ప్రూఫ్‌ కారును చూస్తే అర్థమైపోతుంది. అద్దాలు పగుళ్లు వచ్చి ఉన్నాయి. వెనుక డోర్‌ తెరు­చుకోవడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకొచ్చే పరిస్థితి లేదు. మధ్యలో ఆగి­పోతోంది. ఇటీవల ఓ పర్యటనకు వెళ్తుండగా మధ్య­­లో ఆగిపోవడంతో పర్యటనను అ­ర్ధాం­­తరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. నేను నా వ్యక్తిగత బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు వాడుకునేందుకు అనుమతి కోరగా అధికారులు ఇవ్వలేదు. పైగా వాళ్లు ఇచ్చే కారునే వాడాలన్నారు. నేను ప్రజలను కలవకుండా ఇంటి వద్దనే ఉండాలన్న కారణంతోనే అలాంటి కారును ఇచ్చారు’ అని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు.  

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Recommended image2
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
Recommended image3
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved