MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మీకు ఫ్రీగా ఇంటిస్థలం కావాలా? : ఈ అర్హతలుంటే ఈజీగా పొందవచ్చు

మీకు ఫ్రీగా ఇంటిస్థలం కావాలా? : ఈ అర్హతలుంటే ఈజీగా పొందవచ్చు

మీరు ఆంధ్ర ప్రదేశ్ వాసులా? మీకు ఇప్పటివరకు సొంతిల్లుగానీ, ఇంటిస్థలంగానీ లేదా? అయితే చంద్రబాబు సర్కార్ ఉచితంగా అందించనున్న ఇంటి స్థలాలకు మీరు అర్హులే. ఈ పథకానికి సంబంధించిన పూర్తి డిటెయిల్స్... 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 30 2025, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Free housing Plots Scheme

Free housing Plots Scheme

Free housing Plots Scheme : కూడు,గూడు, గుడ్డ... ఈ మూడు వుంటేచాలు మనిషి ఆనందంగా జీవిస్తాడు. కూడు(ఆహారం) మనిషి బ్రతికేందుకు అవసరం అయితే... గూడు(ఇళ్లు), గుడ్డ(బట్టలు) ఆత్మగౌరవంగా బ్రతికేందుకు అవసరం అవుతాయి. ఇలా మంచి ఇళ్లు, బట్టలు, అహారాన్నే ప్రతిఒక్కరు కోరుకునేది... వీటిని సంపాదించుకునేందుకే కష్టపడేది. పాలకులు కూడా ప్రజలకు మంచి అహరం, మంచి ఇళ్లు, మంచి జీవనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల కోసం సరికొత్త పథకాలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా నిరుపేదల సొంతింటికలను నిజం చేసే దిశగా చర్యలు చేపట్టింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నిరుపేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే... ఈ హామీని నమ్మి ప్రజలు కూటమిని గెలిపించారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నారు... ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఉచిత ఇంటి స్థలాల  పంపిణీకి సంబంధించి అధికారిక ఉత్త్వర్వులను విడుదల చేసారు.  

దారిద్య్రరేఖకు దిగువన (BPL) కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయించాన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. ఇంటి స్థలాల పొందాలంటే ఏ అర్హతలు వుండాలి? లబ్దిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? కేటాయించిన స్థలంలో ఇంటిని ఎప్పట్లోపు ఇళ్లు కట్టుకోవాలి? తదితర వివరాలతో మార్గదర్శకాలను విడుదల చేసారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
Free housing Plots Scheme

Free housing Plots Scheme

ఉచిత ఇంటిస్థలం పొందేందుకు అర్హతలు : 

ఏపీలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు వుండాలనేదే చంద్రబాబు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది... అందుకోసమే 'అందరికీ ఇల్లు' పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద మొదట నిరుపేదలకు ఇంటి స్థలాల పంపిణీకి సిద్దమయ్యారు. మరి ఈ ఇందుకు అర్హులు ఎవరో తెలుసుకుందాం. 

1. దారిద్య్రరేఖకు (BPL) కు దిగువన వుండి అత్యంత పేదరికంలో మగ్గుతూ తలదాచుకోడానికి సొంతిల్లు లేనివారికి ఇంటిస్థలం కేటాయిస్తారు. అయితే వీరివద్ద  తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా వుండాలి. లేదంటే వారి పేదరికాన్ని సూచించే మరేదైనా దృవపత్రం సమర్పించాలి. 

2. లబ్దిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలంగానీ, సొంతిల్లుగానీ వుండకూడదు. సొంతూళ్లలో ఇల్లు వుండి జీవనోపాధి కోసం పట్టణాల్లో వుండే నిరుపేదలకు ఈ పథకం వర్తించదు. అలాగే తమ నివాస ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఇంకెక్కడా స్థలం వున్నా అనర్హులే.

3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహనిర్మాణ పథకాల్లో ఇప్పటివరకు లబ్దిపొంది వుండకూడదు. అలా గతంలోనే ప్రభుత్వ సాయాన్ని పొంది ఇప్పుడు మళ్లీ ఇంటిస్థలం కావాలంటే కుదరదు. వీరు నిరుపేదలే అయినా ఇంటి స్థలానికి అర్హులు కారు. 

33
Free housing Plots Scheme

Free housing Plots Scheme

ఇంటిస్ధలం ఎంత ఇస్తారు? 

అందరికి ఇళ్లు పథకం కింద గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల ఇంటిస్థలాన్ని కేటాయించనున్నారు. ఈ స్థలాన్ని కుటుంబంలోని మహిళల పేరిట కేటాయిస్తారు. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పిస్తూ కన్వేయన్స్ డీడ్  ఇవ్వనున్నారు. అంటే పదేళ్ల తర్వాత ఆ ఇంటిస్థలం ఆ కుటుంబం సొంతం అవుతుందన్నమాట... అప్పటివరకు కేవలం ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకుని జీవించడమే తప్ప ఎలాంటి యాజమాన్య హక్కులు వుండవు. 

ఇక ఇంటి స్థలాన్ని కేటాయించిన రెండేళ్లలోపే ఇంటిని నిర్మించుకోవాలి. ఇలా ఇంటిస్థలాన్ని ఓ కుటుంబానికి ఒకేసారి కేటాయిస్తామని... ఇక ఆ కుటుంబంలో ఇంకెవ్వరికీ ఇవ్వబోమని స్పష్టం చేసారు. అంటే జీవితకాలంలో ఒకేసారి ఉచితంగా ఇంటిపట్టా ఇవ్వనున్నారు. 

 ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పేదల ఇంటిస్థలాల కోసం కేటాయించనున్నారు. గతంలో మాదిరి నివాస ప్రాంతాలకు దూరంగా ఎక్కడో వాగులు వంకల్లో స్థలాలు కేటాయించకూడదని  ఇప్పటికే అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి గ్రామాలు, పట్టణాలకు దగ్గర్లో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలనే అధికారులు గుర్తిస్తున్నారు. త్వరలోనే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతీయ జనతా పార్టీ
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి | Dy CM Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu
Recommended image2
Now Playing
Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
Recommended image3
Now Playing
Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved