MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • పవన్ నేతృత్వంలోనే టిడిపి-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో... ఫోకస్ చేస్తున్న అంశాలివేనట...

పవన్ నేతృత్వంలోనే టిడిపి-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో... ఫోకస్ చేస్తున్న అంశాలివేనట...

టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారయిన నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు జరుగుతున్నట్లు హరిరామ జోగయ్య కీలక ప్రకటన చేసారు. 

2 Min read
Arun Kumar P
Published : Oct 11 2023, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chandrababu Pawan

Chandrababu Pawan

అమరావతి : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు అదే రాజమండ్రి జైలువద్ద ప్రకటించారు. ఇలా చంద్రబాబు అరెస్ట్ తో టిడిపికి చెక్ పెట్టాలని వైసిపి భావిస్తే... టిడిపి, జనసేన పొత్తు ఖరారు చేసుకుని అధికార పార్టీకే కౌంటర్ ఇచ్చారు. ఇలా ఏపీ పాలిటిక్స్ ఎత్తులు, పైఎత్తులతో రసవత్తరంగా సాగుతున్నాయి. 

27
Chandrababu Pawan Jagan

Chandrababu Pawan Jagan

ఇక ఇప్పటికే పొత్తు ఖరారు కావడంతో టిడిపి, జనసేన ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. వైసిపిని ఓడించడమే లక్ష్యంగా ఇరు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే పవన్ వారాహి యాత్రకు టిడిపి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఇలాగే ఉమ్మడి కార్యాచరణ రూపొందించి కలిసికట్టుగా జగన్ సర్కార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోరాటానికి ఇరుపార్టీలు సంసిద్దం అవుతున్నాయి. టిడిపి, జనసేన పార్టీ శ్రేణులను సమన్వయం చేసేందుకు ఇరు పార్టీల నాయకులతో ఓ కమిటీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. 

37
Pawan Kalyan

Pawan Kalyan

ఇదిలావుంటే జనసేన, టిడిపి కూటమి మరో కీలక ప్రక్రియ ప్రారంభించింది. జనసేనాని పవన్ కల్యాణ్ నేతృత్వంలో పీఫుల్స్ మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య కీలక ప్రకటన చేసారు. ప్రజలు, మేధావి వర్గాల సూచనలతో మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంశాల వారిగా చర్చించి కీలక సూచనలను టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు జోగయ్య తెలిపారు. 

47
Pawan Kalyan

Pawan Kalyan

అధికారంలోకి వస్తే పేదలకు అండగా వుంటామని భరోసా ఇచ్చేలా టిడిపి, జనసేన మేనిఫెస్టో వుంటుందని హరిరామ జోగయ్య అన్నారు. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదంటే ఉపాధి కల్పించాలన్నదే రాబోయే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు.  

57
polavaram

polavaram

ఇక ఆంధ్ర ప్రదేశ్ ను సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు కోస్తా కారిడార్ విస్తరణ, పారిశ్రామిక అభివృద్దికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇలా అటు వ్యవసాయం, ఇటు పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేలా రాబోయే ప్రభుత్వ చర్యలు వుంటాయని హరిరామ జోగయ్య వివరించారు. 

67
pawan

pawan

విద్యా, ఉద్యోగాల్లో బిసిలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించేలా... కాపుల జనాభా ప్రాతిపదికన అవకాశాల దక్కేలా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందని అన్నారు. ఇలా వెనకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందనే భరోసా టిడిపి, జనసేన కూటమి మేనిఫెస్టోతో దక్కనుందని హరిరామ జోగయ్య అన్నారు. 

77
Harirama jogaiah

Harirama jogaiah

రాష్ట్రానికి చెందిన అన్నివర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 18 మందితో మేనిఫెస్టో ఖరారు కమిటీ ఏర్పాటు చేసినట్లు హరిరామ జోగయ్య తెలిపారు. ప్రజలను కూడా ఈ మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ అభిప్రాయాలు తెలియజేయాలనేవారు అక్టోబర్ నెలాఖరులోగా 98486 34249, 70369 24692   నెంబర్లకు ఫోన్ చేయాలని హరిరామ జోగయ్య సూచించారు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Recommended image2
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Recommended image3
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved