బాబుకు షాక్: గుంటూరు నేతలు బీజేపీలోకి, కమలం టార్గెట్ వాళ్లే

First Published 21, Jul 2019, 12:19 PM

ఆంధ్రప్రదేశ్ రాష్రంలో బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించింది. టీడీపీకి చెందిన నేతలపై కమల దళం వల విసురుతోంది.

ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని  బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలపై ముందుగా బీజేపీ నాయకత్వం వల విసురుతోంది.

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీడీపీకి చెందిన కీలక నేతలను బీజేపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం కూడ సుజనాకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

ఆదివారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను డాక్టర్ అరవింద్ బాబు కలిశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన  ఎన్నికల్లో నర్సరావుపేట నుండి డాక్టర్ అరవింద్ బాబు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతిలో అరవింద్ బాబు ఓటమి పాలయ్యాడు.

అదే ఎన్నికల్లో మాచర్ల నుండి చలమారెడ్డి టీడీపీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. రాయపాటి సాంబశివరావు వల్లే టిక్కెట్టు దక్కలేదని చలమారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో చలామరెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తున్నారు.

చలమారెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో  భేటీ అయ్యారు.  చలామరెడ్డి కూడ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు చంద్రబాబుతో సమావేశమయ్యారు.

రాయపాటి సాంబశివరావు కూడ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే తన అనుచరులు కూడ బీజేపీలో చేరేందుకు వీలుగా రాయపాటి పావులు కదుపుతున్నారని అంటున్నారు.

వారం రోజుల క్రితమే  అన్నం సతీష్ కూడ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అన్నం సతీస్ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి శిష్యుడు. సుజనా చౌదరితో మరికొందరు నేతలు కూడ టచ్‌లోకి వెళ్లినట్టుగా చెబుతున్నారు.

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడ బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతోందని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో  ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో  అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకొంది.

దీంతో ఏపీ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంలో పార్టీ బలోపేతం చేసి ఎన్నికలకు సిద్దం కావాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ దిశగానే బీజేపీ నాయకులు  ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే  ప్రధానంగా టీడీపీ నేతలపై కేంద్రీకరించింది బీజేపీ అధికార వైసీపీకి చెందిన అసంతృప్తి నేతలపై కూడ బీజేపీ వల విసిరేసేందుకు సర్వం సిద్దం చేసుకొంటుంది.

loader