MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబు సర్కార్ తీపికబురు ... సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు

చంద్రబాబు సర్కార్ తీపికబురు ... సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు

సంక్రాంతి పండక్కి చంద్రబాబు సర్కార్ తీపికబురు అందించింది. ఇప్పటికే సెలవులు కొనసాగుతుండగా వీటిని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 15 2025, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Sankranti holidays

Sankranti holidays

Sankranti holidays : తెలుగు పల్లెల్లో సంక్రాంతి పండగ శోభ కనిపిస్తోంది. ఊరూ వాడ అంతా పండగ సంబరాల్లో మునిగిపోయారు. మగాళ్లు కోడి పందేలు, మందు పార్టీలతో... ఆడవాళ్లు ముగ్గులు, పిండివంటలతో... పిల్లలు పతంగులు, సరదా ఆటలతో ప్రతి గ్రామం సందడి సందడిగా కనిపిస్తోంది. ఇలా అందరూ పండగను ఎంజాయ్ చేస్తుంటే కొందరు ఉద్యోగులు మాత్రం విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ ఉద్యోగుల పరిస్థితి ఇంతే. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని బ్యాంక్ ఉద్యోగులు మాత్రం హాయిగా కుటుంబసభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, హజ్రత్ అలీ పుట్టినరోజు నేపథ్యంలో జనవరి 14న బ్యాంకులకు సెలవు ఇచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి మూడురోజుల పండగ... అయినా జనవరి 13 భోగి రోజు బ్యాంకులు నడిచాయి. నిన్న జనవరి 14న  ఒక్కరోజు మాత్రమే బ్యాంకులకు సెలవు. ఇవాళ కనుమ వున్నా బ్యాంక్ ఎంప్లాయిస్ కు మాత్రం సెలవు లేదు. 

ఇలా పండగపూట కూడా కుటుంబంతో గడపకుండా విధులకు హాజరుకావాల్సి వస్తోందని ఏపీ బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో జనవరి 15 బుధవారం కూడా సెలవు ప్రకటించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆంధ్ర ప్రదేశ్ శాఖతో పాటు   జనరల్ మేనేజర్ ఆండ్ కన్వీనర్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కోరింది.  దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు సర్కార్ సంక్రాంతి సెలవును పొడిగించింది.. జనవరి 15న కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Sankranti holidays

Sankranti holidays

తెలంగాణ బ్యాంకుల సంగతేంటి? 

ఆంధ్ర ప్రదేశ్ లోని బ్యాంక్ ఉద్యోగులకు కనుమ సందర్భంగా సెలవు వచ్చింది. అంటే వరుసగా రెండ్రోజులు (జనవరి 14, 15) బ్యాంకులు మూతపడుతున్నాయి. మరి తెలంగాణలో బ్యాంకుల సంగతేంటి? తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ కు కూడా నిన్న(మంగళవారం) సంక్రాంతి సెలవు ఇచ్చారు? మరి ఏపీలో మాదిరిగా జనవరి 15న కనుమకు కూడా సెలవు ఏమైనా ఇచ్చారా? అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 

అయితే తెలంగాణలో కేవలం ఒక్కరోజే సంక్రాంతి సెలవు ప్రకటించారు. జనవరి 14న  మాత్రమే సెలవు... జనవరి 15న కనుమ సందర్భంగా ఎలాంటి సెలవు ప్రకటించలేదు రేవంత్ సర్కార్. అందువల్ల ఇవాళ (బుధవారం) తెలంగాణలోని బ్యాంకులు యధావిధిగా నడుస్తాయి. అయితే పండగ నేపథ్యంలో ఎక్కువమంది ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం వుంటుంది... కాబట్టి బ్యాంక్ పనులు చాలా నెమ్మదిగా సాగుతాయి. 

ఇక గత మూడునాలుగు రోజులుగా వరుస సెలవులు వచ్చాయి. జనవరి 11 రెండో శనివారం, జనవరి 12 ఆదివారం సాధారణ సెలవు వచ్చింది. జనవరి 13 సోమవారం బ్యాంకులు నడిచాయి... ఆ తర్వాత జనవరి 14 సంక్రాంతి సెలవు వచ్చింది. ఇలా వరుస సెలవుల తర్వాత బ్యాంకులు ఓపెన్ అవుతున్నాయి... ఉద్యోగులు తక్కువగా వుండే అవకాశం వుంది... కాబట్టి బ్యాంకుల్లో రద్దీ వుండే అవకాశం వుంది. ఈ విషయాన్ని గుర్తించి బ్యాంకు పనులు వున్నవారు ప్లాన్ చేసుకోవాలి. 

ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఇవాళ(బుధవారం) కూడా సెలవు వుంది... కాబట్టి రేపు (జనవరి 16,గురువారం) బ్యాంకులు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్కడ కూడా బ్యాంకులు తెరిచేరోజు రద్దీ ఎక్కువగా వుండే అవకాశం వుంది. 

33
Bank Holidays

Bank Holidays

ఇవాళ ఏఏ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు : 

జనవరి 14న సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులు మూతపడ్డాయి. అలాగే వివిధ వేడుకల నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ , తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఒడిషా, కేరళ, పంజాబ్, సిక్కిం, అస్సోం,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో బ్యాంకులు మూతపడ్డాయి. 

జనవరి 15న బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ అభ్యర్థన మేరకు ఆంధ్ర ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అలాగే తిరువళ్ళువర్ దినోత్సవం, మాఘ బిహు పూజ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. జనవరి 16న కూడా ఉజ్జవర్ తినునాల్ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే తమిళనాడులో వరుసగా మూడు రోజులు పొంగల సెలవులు వచ్చాయన్నమాట. 

ఇలా ఈ జనవరిలో ఇప్పటికే బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. ఇకపై కూడా వివిధ రాష్ట్రాల్లో వేరువేరు కారణాలతో బ్యాంక్ ఉద్యోగులకు సెలవులున్నాయి. అయితే బ్యాంకులు పనిచేయకున్నా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో వుంటాయి కాబట్టి ఏ బ్యాంక్ వినియోగదారులకైనా పెద్ద ఇబ్బంది వుండదు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Richest Temples in AP : తిరుమల తర్వాత.. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 ఆలయాలేవి?
Recommended image2
Delimitation Bill: డీలిమిటేషన్‌తో మారనున్న పొలిటికల్ మ్యాప్.. ఏపీ, తెలంగాణ సీట్ల లెక్కలు ఇవే
Recommended image3
ఏపీలో రూ. 13,667 కోట్ల‌తో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్‌.. ఎక్క‌డ రానుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved