Bank Holidays : మే నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు... ఎన్నిరోజులో తెలుసా?
Bank Holidays : మే 2025 లో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో ఎన్ని సెలవులు వస్తున్నాయో రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ సెలవుల జాబితా ఇక్కడ చూద్దాం.

Bank Holidays
Bank Holidays : వచ్చే నెల మేలో ఆర్థిక లావాదేవీల కోసం మీరు బ్యాంకుకు వెళ్లాల్సి ఉందా? అయితే మీకోసమే ఈ సమాచారం. మరో రెండ్రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది... మేలో అడుగుపెట్టబోతున్నాం... కాబట్టి ఈ నెలలో బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుందాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు వెళితే ఎలాంటి ఆటంకం, ఆలస్యంలేకుండా ఆర్థిక లావాదేవీలైనా, ఇతర బ్యాంకింగ్ పనులైనా చక్కబెట్టుకోవచ్చు.
భారత రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం మే నెలలో ఏకంగా 12 రోజులు సెలవులు వస్తున్నాయి... ఆదివారం, రెండు, నాలుగో శనివారం సెలవులతో పాటు మరికొన్ని ప్రత్యేక సెలవులు వస్తున్నాయి. ఆ సెలవుల గురించి తెలుసుకుందాం.
Bank Holidays
మే నెల బ్యాంక్ సెలవుల లిస్ట్ :
మే 1 : కార్మిక దినోత్సవం (దేవవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఈ సెలవు వర్తిస్తుంది)
మే 4 : ఆదివారం (సాధారణ సెలవు)
మే 9 : శుక్రవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (తెలుగు రాష్ట్రాల్లో ఈ సెలవు వర్తించదు. పశ్చిమ బెంగాల్ లో సెలవు ఉంటుంది)
మే 10 : రెండవ శనివారం సెలవు
మే 11 : ఆదివారం (సాధారణ సెలవు)
మే 12 : బుద్ద పూర్ణమ (కర్ణాటకలో సెలవు ఉంటుంది. తెలంగాణలో ఈరోజు ఆప్షనల్ హాలిడే)
మే 16 : శుక్రవారం (సిక్కిం స్టేట్ డే (ప్రాంతీయ సెలవు)
మే 18 : ఆదివారం
మే 24 : నాలుగో శనివారం సెలవు
మే 25 : ఆదివారం
మే 26 : ఖాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు (సిక్కి ప్రాంతీయ సెలవు)
మే 29 : మహారాణా ప్రతాప్ జయంతి ( కొన్నిరాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సెలవు ఉండదు)
Bank Holidays
బ్యాంకులకు వెళ్లకుండానే ఆర్థిక లావాదేవీలు ఎలా జరపాలి?
గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రతి ఆర్థిక లావాదేవీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేదు. కేవలం చేతిలో ఫోన్ ఉంటే... బ్యాంక్ సేవలన్ని మన ఇంటివద్దకే వచ్చేస్తాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఇక ఆర్థిక లావాదేవీల కోసం యూపిఐ, ఇతర మనీ ట్రాన్సాషన్ యాప్స్ ఉపయోగింవచ్చు.
గమనిక : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయిలో బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదలచేసింది. కాబట్టి ఈ సెలవులు అన్నిరాష్ట్రాల్లో ఒకేలా ఉండవు... ప్రాంతాన్ని బట్టి మారతాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.