MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Annadatha Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. అకౌంట్లోకి రూ.6,000 పెట్టుబడి సాయం

Annadatha Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. అకౌంట్లోకి రూ.6,000 పెట్టుబడి సాయం

Annadatha Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు త్వరలో అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ నిధులు అందనున్నాయి. రెండు పథకాలు కలిపి అర్హుల ఖాతాల్లో రూ.6,000 జమ అయ్యే అవకాశం ఉంది. ఈకేవైసీ, ఆధార్ లింకింగ్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 19 2026, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైతులకు పండుగ ట్రీట్.. ఖాతాలో ఒకేసారి రూ.6,000 జమ
Image Credit : chatgpt

రైతులకు పండుగ ట్రీట్.. ఖాతాలో ఒకేసారి రూ.6,000 జమ

ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది మంది అన్నదాతలు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అలాగే కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకాల తదుపరి విడత నిధులు త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ రెండు పథకాల ద్వారా అర్హులైన రైతన్నలకు ఒకేసారి రూ.6,000 అందే అవకాశం ఉందని సమాచారం.

గతంలో దసరా పండుగ సందర్భంగా ఈ నిధులు వస్తాయని రైతులు భావించినప్పటికీ విడుదల కాలేదు. దీంతో ఇప్పుడు దీపావళికి ముందైనా ఈ పెట్టుబడి సాయం అందుతుందా అని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రైతులకు ఏటా రూ.20,000 పెట్టుబడి సాయం
Image Credit : chatgpt

రైతులకు ఏటా రూ.20,000 పెట్టుబడి సాయం

ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.14,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం 'పీఎం కిసాన్' పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 చొప్పున సాయం చేస్తుండగా, రెండు పథకాలు కలిపి మొత్తం ఏడాదికి రూ.20,000 రైతులకు అందుతున్నాయి.

ఈ మొత్తాన్ని ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, రాబోయే విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4,000, కేంద్రం నుంచి పీఎం కిసాన్ కింద మరో రూ.2,000 కలిపి మొత్తం రూ.6,000 నేరుగా రైతు ఖాతాల్లోకి చేరనున్నాయి.

35
పెరిగిన సాగు ఖర్చులు.. రైతులకు ఆర్థిక భరోసా
Image Credit : others

పెరిగిన సాగు ఖర్చులు.. రైతులకు ఆర్థిక భరోసా

ప్రస్తుత రోజుల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ అద్దెలు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు అకాల వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఊరటనిస్తుంది.

పండుగల సమయాల్లో లేదా వ్యవసాయ పనుల ఆరంభంలో ఈ డబ్బులు అందితే కుటుంబ అవసరాలతో పాటు సాగు ఖర్చులకు కూడా ఎంతో ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని అన్నదాతలు భావిస్తున్నారు.

45
నిధులు రావాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాలి
Image Credit : gemini

నిధులు రావాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాలి

పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు కొన్ని ముందస్తు సాంకేతిక ప్రక్రియలను సరిగ్గా పూర్తి చేసుకున్నారో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే డబ్బులు జమ అయ్యేటప్పుడు ఆటంకాలు ఎదురుకావచ్చు.

• రైతులు తమ ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేయాలి.

• బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి.

• బ్యాంకు ఖాతాకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కచ్చితంగా పూర్తయ్యేలా చూసుకోవాలి.

• భూమి రికార్డులు, లబ్ధిదారుల జాబితా వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా సరిచూసుకోవాలి.

ఒకవేళ ఈ వివరాలలో ఏవైనా లోపాలు ఉంటే నగదు జమ కావడంలో ఆలస్యం జరగవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాలు, మీ సేవా లేదా కామన్ సర్వీస్ కేంద్రాలను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

55
అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సిందే
Image Credit : AI

అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సిందే

మొత్తానికి ఏపీలో తదుపరి విడత అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ నిధుల కోసం అడుగులు పడుతున్నాయి. రూ.6,000 సాయం ఏ తేదీన కచ్చితంగా జమ అవుతుంది అనేదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ప్రచారాలను నమ్మి మోసపోకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను మాత్రమే రైతులు గమనించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వ్యవసాయం (Vyavasayam)
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాలకు హైఅలర్ట్
Recommended image2
YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
Recommended image3
Now Playing
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu
Related Stories
Recommended image1
Weather Update: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాలకు హైఅలర్ట్
Recommended image2
World Best Cities: ప్రపంచంలో నంబర్ 1 నగరం ఏదో తెలుసా? టాప్ 7 బెస్ట్ సిటీల లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved